కాదేదీ రాజకీయాలకు అనర్హం అంటున్నారు మన ఏపీ రాజకీయ నాయకులు.. వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా బంధువుకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరవాత వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఎమ్మెల్యే ముస్తాఫా, ఆయన కుటుంబ సభ్యులు చివరకు గన్ మెన్ కూడా క్వాటంటైన్‌లో కి వెళ్లారు. ఇంత వరకూ ఓకే.. అనుమానం వస్తే ఎవరైనా క్వారంటైన్ లోకి వెళ్లడం మంచిదే.

 

 

అయితే ఇప్పుడు ఈ అంశంపైనా రాజకీయాలు జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఇటీవల విందు ఇచ్చాడని.. ఆ విందుకు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. అయితే దీన్ని వైసీపీ నాయకులు ఖండిస్తున్నారు. కరోనా వైరస్‌ను రాజకీయాలకు వాడుకోవడం నీచమైన చర్య అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 

ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా ఇచ్చిన విందుకు తాను హాజరు కాలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ముస్తాఫా విందుకు వెళ్లారని జరుగుతున్న ప్రచారాన్ని అంబటి ఖండించారు. అసలు విందే జరగలేదని.. జరగని విందుకు తామేలా వెళ్తామని అంబటి ప్రశ్నించారు.

 

 

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ తో వణుకుతుంటే .. రాజకీయ ప్రత్యర్థులు తమపై ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని అంబడి మండిపడ్డారు. తామంతా క్వారంటైన్‌కు వెళ్లాలని ట్రోల్‌ చేస్తున్నారని అంబటి వివరించారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని... నిజంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే.. సామాజిక బాధ్యతగా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అంబటి అంటున్నారు. ఔరా ఏమి రాజకీయం..?

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: