కరోనా వైరస్ కట్టడి కోసం భారత దేశమంతా లాక్‌ డౌన్ లో ఉంది. అయితే కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో పట్నాలు, నగరాల కంటే పల్లె టూళ్లే కాస్త బెటర్ అన్న వాదన వినిపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వైరస్ వ్యాపించే రిస్క్ ఎక్కువగా ఉంటోంది. అందుకే కరోనా నేపథ్యంలో నగరాల్లో, పట్టణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

 

 

ఆంధ్రప్రదేశ్‌ లో పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 వరకే అనుమతిస్తున్నారు. నిపుణుల సూచనల మేరకు సమయాన్ని కుదించినట్టు చెబుతున్నారు. అందుకే ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావద్దని అధికారులు, మంత్రులు హెచ్చరిస్తున్నారు. ఇక గ్రామాల్లో మాత్రం నిత్యావసరాల కొనుగోలుకు మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇస్తున్నారు.

 

 

ప్రజలు ఒక్కసారిగా బయటకు రావద్దని వారు సూచింస్తున్నారు. నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని.. నిత్యావసరాలకు ఏ కొరత లేకుండా చూస్తామని మంత్రులు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల విక్రయాలపై కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌ ఇప్పటికే ఆదేశించారు. ప్రతి షాపు వద్ద నిత్యావసర వస్తువుల ధరల పట్టిక ఏర్పాటు చేయడంతో పాటు.. కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా పట్టికలో చూపించాల్సి ఉంటుంది.

 

 

ఇక పట్టణాల్లో, నగరాల్లో మొబైల్స్‌ మార్కెట్స్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అత్యవసర పనుల నిమిత్తం అనుమతించిన సమయాల్లో బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటే మంచిది. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముందు శుభ్రంగా చేతులు కడుక్కుని వెంటనే తలస్నానం చేయడం మంచిదని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఏపీలో వెలుగు చూసిన కేసుల్లో చాలా వరకూ పట్నాలు, నగరాల్లో వెలుగు చూసినవే ఉన్నాయి. అందుకే పట్నం వాసులూ జర జాగ్రత్త.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: