తనకు వచ్చి ఐడియాతో అగ్రరాజ్యం మెడలు వంచాలని చూసింది చైనా.. కానీ కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు మారింది పరిస్దితి.. ఏదో చేయబోతే ఏదో జరిగింది.. చైనా వేసిన ఎత్తుకు ప్రపంచదేశాలన్ని బలి అయ్యాయి.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ లోకి వెళ్లిపోయింది.. ఈ కరోనా దెబ్బకు బలి అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.. వేలాదిగా ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం దాదాపు 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే ఉన్నారు.

 

 

ఇకపోతే ఈ వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 33వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 7.22 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 3వేల మంది మృతిచెందారు. వైరస్ నిర్ధారణ అయిన వారిలో 1,52,000 మంది కోలుకుంటే.. మరో 5.09 లక్షల మంది లో స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. అయితే, 26,681 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారుతుంది..

 

 

ఇక మొత్తం కరోనా వైరస్ మరణాల్లో 70 శాతం ఐరోపా దేశాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఇదేగాక అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అంతే గాక ఇప్పటివరకు అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అన్ని అమెరికాలోనే నమోదయ్యాయంటే ఆ దేశ పరిస్దితి ఊహించు కోండి... ప్రస్తుతం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.41 లక్షలు దాటగా, వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.. ఇక ఈ దేశంలో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,400కు చేరుకోగా.. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 1,000 మంది హరీ అన్నారు.

 

 

ఆదివారం 18వేలకుపైగా పాజిటివ్ కేసుల నమోదు కావడంతో అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 141, 000కి పెరిగింది. ఇప్పటి వరకు 8,94,000 మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. న్యూయార్క్ రాష్ట్రంలో 60 వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇక ప్రస్తుత పరిస్దితులను చూస్తుంటే చైనా నష్టపోయినా అమెరికాను కరోనా వైరస్‌తో గట్టిదెబ్బ కొట్టింది అనుకుంటున్నారు నెటిజన్స్.. మరి దీనికి ప్రతీకారంగా ఈ అగ్ర రాజ్యం ఏం చేస్తుందో ముందు ముందు చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: