ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న విశాఖలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 21కు చేరింది. రాష్ట్రంలో విశాఖలో అత్యధికంగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా రాష్ట్రంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. 
 
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. తాజాగా ప్రభుత్వం పట్టణాల్లో 11 గంటల వరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలా లాక్ డౌన్ నిబంధనలలో మార్పులు చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా మొబైల్ హ్యాండ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. 
 
హ్యాండ్ శానిటైజర్ బాటిల్స్ వినియోగదారుల అవసరాలకు సరిపడా అందుబాటులో ఉండటం లేదు. మెడికల్ షాపుల్లో కూడా శానిటైజర్లు లభించడం లేదు. సిటీలు, పట్టణాల్లో హ్యాండ్ శానిటైజర్లు లభిస్తున్నప్పటికీ గ్రామాల్లో, స్లమ్ ఏరియాల్లో ఉండే ప్రజలకు శానిటైజర్లు లభించడం లేదు. అందువల్ల ప్రభుత్వం వీరికి ఫ్రీ హ్యాండ్ శానిటైజర్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. ఏపీలో ఇప్పటివరకూ 21 మంది కరోనా భారీన పడగా ఇద్దరు కోలుకున్నారు. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 1139కు చేరుతోంది. నిన్న ఒక్కరోజే 130 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కేరళలో 19 కేసులు, మహారాష్ట్రలో 16 కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య 91కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండటం గమనార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: