కరోనా వైరస్ డబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తుపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో జనులు బిక్కు బిక్కు మంటూ నాలుగు గోడల మధ్యన కాలం వెళ్లబుచ్చుతున్నారు . ఇక ఇప్పటికే, దేశాలను దాటుకొని... రాష్ట్ర సరిహద్దులను కూడా దిగ్బంధం చేస్తున్న విషయం తెలిసినదే.  జిల్లాల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే వుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒకరు కోలుకోవడం శుభ సూచికగా కనిపించినా, లాక్ డౌన్ విషయంలో ఖచ్చిత నియమాలు పాటించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రలు సూచించారు.

 

ఇక పొతే.. ప్రపంచంలో గాని మనం చూసుకుంటే... యూర‌ప్ కంట్రీస్ పరిస్థితి అద్వానంగా ఉందనే చెప్పుకోవాలి.. ఐరోపాలో ఇప్పటి వరకు 20 వేల మరణాలు నమోదు అయ్యాయి. ఇటలీలో జనులు ఆహారంతో అలమటిస్తూ... మరణించే పరిస్థితి దాపురించింది. ఇటీవల స్పెయిన్ యువరాణిని కరోనా మహమ్మారి బలితీసుకుంది.. జర్మనీలో తీవ్ర మనస్తాపం చెందిన మంత్రి ఒకరు ఆత్మ హత్య చేసుకున్న ఉదంతం అందరిని కలచి వేసింది..

 

అత్యంత ఘోర విపత్తులతో ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో.. కరోనా ప్రభావాన్ని తిప్పి కొట్టడానికి పలువురు ప్రముఖులు దాతలుగా మారి, వారి ఉదారతను చాటుకుంటున్నారు. మహమ్మారి కరోనా అగ్రరాజ్యమైన అమెరికాలో అయితే విలయ తాండవం చేస్తుందనే చెప్పుకోవాలి. ఇక మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర 203 ; కేరళ 202 ; కర్ణాటక 84 ముందు వరుసలో వున్నాయి... ఇక విశ్వ వ్యాప్తంగా చూసుకుంటే.. వివరాలు ఇలా వున్నాయి..

 

వరల్డ్ వైడ్ బాధితుల సంఖ్యా  - 7, 22 , 664
మరణాల సంఖ్య - 33, 983
రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1, 51, 793

 

ఇండియాలో కేసుల సంఖ్య - 1, 024
మరణాల సంఖ్య - 27
పాజిటివ్ కేసుల సంఖ్య - 95

 

తెలంగాణ‌లో మొత్తం కేసులు - 70
మృతులు - 1
ఏపీలో మొత్తం కేసులు - 21
మృతులు - 0

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: