ప్రధాని నరేంద్ర మోదీ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ అమలు కానుంది. లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే గత కొన్ని రోజుల నుండి లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వసున్నాయి. ఈ వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. 
 
సోషల్, వెబ్ మీడియాలో ఈ నెలాఖరు వరకు లేదా మరో మూడు నెలల పాటు లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కేంద్రం నుంచి ఈ విషయం గురించి స్పష్టత వచ్చింది. ప్రధాని మోదీ సూచనల మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ లాక్ డౌన్ పొడిగింపు గురించి వైరల్ అవుతున్న వార్తలను ఖండించారు. కేంద్రానికి లాక్ డౌన్ ను పొడిగించాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 
 
ఏప్రిల్ 14 వరకు మాత్రమే దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటన చేశారు. సోషల్, వెబ్ మీడియాలో లాక్ డౌన్ పొడిగింపు గురించి వస్తున్న వార్తలు చూసి తాము కూడా ఆశ్చర్యపోతున్నామని తెలిపారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ పొడిగింపు గురించి తమ దగ్గర ఎటువంటి ప్రతిపాదనలు లేనట్లు స్పష్టం చేశారు. గత మంగళవారం రోజున ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ కు పిలుపునిచ్చారు. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. దేశంలో కొత్తగా వైరస్ భారీన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్నటివరకు భారత్ లో 1071 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా భారీన పడి 29 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయాలను వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకూ 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 21 మంది కరోనా భారీన పడ్డారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: