ప్రపంచంలో కరోనా ఎఫెక్ట్ ఎంత ఘోరంగా ఉందో అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయానికి అన్ని దేశాలు తమ శాయశక్తులుగా కృషి చేస్తున్నారు.  చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా లో ఈ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది.  అయితే కరోనా ఎఫెక్ట్ తో ఎన్నో వాణిజ్య సంస్థలు మూసి వేసే పరిస్థితి నెలకొంది.  ఈ నేపథ్యంలో అమెరికాలో 5 దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ పత్రిక ప్రింట్ ఎడిషన్ మూతపడింది. ప్రవాస భారతీయుడైన గోపాల్ రాజ్ 1970లో ‘ఇండియా అబ్రాడ్’ పేరుతో పత్రికను స్థాపించారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు అక్కడ ఎలాంటి ప్రకటనలు రావడం లేదు... దాంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.

 

అమెరికాలోని భారతీయుల మన్ననలు అందుకున్న ఈ పత్రిక రాజకీయం, సాంకేతికత, సాహిత్యం వంటి రంగాల్లో విస్తృతంగా వార్తలు అందిస్తోంది. 2011లో రిడిఫ్ డాట్ కామ్ ఈ పత్రికను కొనుగోలు చేయగా, 2016లో ‘8కే మైల్స్ మీడియా ఇంక్’ ఈ పత్రికపై యాజమాన్య హక్కులను సొంతం చేసుకుంది.   ప్రకటనలు లేకపోవడంతో నిర్వహణ ఖర్చు భారమైంది. దీంతో ప్రింట్ ఎడిషన్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన యాజమాన్యం.. వెబ్ ఎడిషన్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

 

న్యూయార్క్‌ను వైరస్ మరింత వణికిస్తోంది. రాష్ట్రంలోని బాధితుల్లో సగం మంది ఈ నగరం వారే. దీంతో నగరం మొత్తాన్ని దిగ్బంధించాలని అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వారిపైనే ఇప్పటి వరకు కరోనా పంజా విసరగా, తాజాగా ఇల్లినాయిస్‌లో ఓ శిశువు కరోనా కారణంగా మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: