ప్రపంచ ప్రజలంతా కరోనా వైరస్ కారణంగా అల్లాడుతుంటే... కేరళ రాష్ట్ర ప్రజలు మాత్రం మద్యం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలని తెరవడం చట్టరీత్యా నేరం. దాంతో తాగుడికి బాగా అలవాటు పడిన వారు మద్యం లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అయినప్పటికీ కోవిడ్ 19 వ్యాధి కారణంగా కేవలం ఒకే ఒక్కరు మరణించారు. కానీ లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు మూసివేయడం వలన ఇప్పటివరకు తొమ్మిది మంది తాగుబోతులు మరణించారు. ఈ తొమ్మిది మందిలో ఏడుగురు ఆత్మహత్య చేసుకోగా... ఒకరు గుండెపోటుతో మరణించగా... మరొకరు ఆఫ్టర్ షేవ్ లోషన్ తాగి చనిపోయాడు.


ఇంకా చాలామంది మద్యం దొరకక ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. ఆదివారం రోజు ఓ 46 ఏళ్ల వ్యక్తి ఒక బిల్డింగ్ నుండి కిందికి దూకాడు. అయితే సమయానికి స్థానిక ప్రజలు అతనిని ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. నివేదికల ప్రకారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది తాగుడికి బాగా అలవాటు పడ్డారని... వారు ఎక్కువ రోజులు తాగకపోతే తట్టుకోలేరు అని తెలిసింది.



ప్రస్తుతం తాగుబోతుల విపరీత ప్రవర్తన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక చేసేదేమీ లేక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి బాగా అలవాటు పడిన మందుబాబులకు మద్యం అందేలా చేయమని సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. అయితే మద్యం లేకపోతే తాము బతకలేమని భావించేవారు ఓ వైద్యుడి వద్దకు వెళ్లి తాను మద్యానికి బానిస అయ్యానని నిరూపించుకుంటే... డాక్టర్ వారికి ఒక వాలిడ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఐతే ఆ వ్యాలిడ్ సర్టిఫికెట్ సంపాదించినవారు కేరళలో ఎక్కడైనా మద్యం కొనుక్కోవచ్చు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: