ఏ దుర్మూహూర్తంలో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిందో కానీ ఎంతో ఆనందంగా ఉన్న మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఇలా ప్రతి నిత్యం ఎంతో బిజీగా ఉండే మనుషులు ఇంటిపట్టున ఉండేలా చేసింది.  అయితే ఎదైనా పనిపై బయటకు రావాలంటే ఖచ్చితంగా మాస్కులు ధరించి రావాలని చెబుతున్నారు.  ఒక ప్రొడెక్ట్ అవసరం కొద్ది మాత్రమే చేస్తుంటారు.. కానీ ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా అత్యవసరం కావడంతో తీవ్రమైన డిమాండ్.. కొరత ఏర్పడింది.  మాస్కులు తయారు చేయాలంటే ఇప్పుడు చాలా సమయం.. డబ్బు కావాల్సి వస్తుంది.  ఇక కరోనావైరస్‌ను పారద్రోలాలంటే ఇళ్లకు పరిమితం కావడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం మాత్రమే మార్గాలు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

 


ఇక భారత్‌లో అంతకంతకూ పెరిగిపోతున్న కేసులకు చికిత్స అందించాలంటే మెడికల్ ఎక్విప్‌మెంట్ చాలడం లేదు.  ఇందులో ముఖ్యంగా ముఖానికి ధరించాల్సిన ఫేస్‌ మాస్క్‌లు కొరత ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. కరోనాని కట్టడి చేయడానికి భారత్‌కు 38 మిలియన్ మాస్కులు, 6.2 మిలియన్ వ్యక్తిగత సంరక్షణ ఎక్విప్‌మెంట్‌లు అవసరం పడతాయని అంచనా. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మాస్కులను ఇతర అవసరాలను సప్లయ్ చేయాల్సిందిగా కొన్ని వందల కంపెనీలను ఆశ్రయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత్‌లో 1030 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 27 మంది మృతి చెందారు.

 


ఇండియా ఏజెన్సీ అనే సంస్థ దాదాపు 730 కంపెనీలను ఆశ్రయించి మాస్కులు, వెంటిలేటర్లు, ఐసీయూ మానిటర్స్, టెస్టింగ్ కిట్స్‌ అందజేయాలని కోరినట్లు మార్చి 27న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మాస్కుల సంఖ్య 9.1 మిలియన్‌గా ఉండగా వ్యక్తిగత సంరక్షణ పరికరాలు లేదా ఎక్విప్‌మెంట్స్ 8లక్షలుగా ఉన్నాయని ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇందులో 14 మిలియన్ మాస్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం అవుతుండగా మిగతావి కేంద్ర ప్రభుత్వంకు అవసరమవుతా యని వెల్లడించింది. ఇక సంరక్షణ కిట్స్‌ విషయానికొస్తే అవి 6.2 మిలియన్‌గా ఉందని స్పష్టం చేసింది.  ఏది ఏమైనా ఈ సమయంలో అన్నింటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్రం అంటుంది.

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: