దక్షిణాది భారతదేశంలో కేరళ తర్వాత ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం తెలంగాణ. ఎన్ని జాగ్రత్తలు మరియు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకుంటున్న గాని తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆ ఐదు జిల్లాలు కెసిఆర్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ అయిదు జిల్లాలలోనే ఎక్కువగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అవి ఏమిటంటే హైదరాబాద్.. కరీంనగర్.. భద్రాద్రి-కొత్తగూడెం.. రంగారెడ్డి.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు.

 

దీంతో ఈ 5 జిల్లాల్లో విషయంలో కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వారికి ఎక్కువగా కరోనా వైరస్ ఉంటున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చాలా మంది విదేశాల నుండి రావడంతో కేసులు ఎక్కువగా నమోదు అయింది. మరోపక్క హైదరాబాద్ పరిధిలో దగ్గరగా ఉండే రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలలో కూడా విదేశాల నుండి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మీ ప్రాంతాలలో కూడా పాజిటివ్ కేసు నమోదు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కరోనా 5 జిల్లాలో ఉండటంతో ఈ జిల్లా నుండి ఎవరు బయటకు రాకుండా ఇతర ప్రాంతాలకు ఈ జిల్లాలకు సంబంధం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు కేసీఆర్.

 

ఈ జిల్లాల నుండి ఇతర జిల్లాలకు కరోనా వైరస్ రాకుండా ప్రజలను ఎక్కడి వారు అక్కడే ఉంచే విధంగా సరైన సరికొత్త ప్లాన్ తెలంగాణ సర్కార్ అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీ యాప్ కెసిఆర్ ప్రభుత్వం తీసుకురానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ 5 జిల్లాల్లో నిత్యవసర సరుకులు విషయం అలాగే కూరగాయల విషయంలో కూడా ప్రతి ఇంటికి ప్రభుత్వమే పంపించాలని ఆలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే హైదరాబాద్.. కరీంనగర్.. భద్రాద్రి-కొత్తగూడెం.. రంగారెడ్డి.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: