ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్ ను విడుదల చేసింది. అయితే ఆ బుల్లెటిన్ ప్రకారం నిన్న రాత్రి కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి కి చెందిన 72 ఏళ్ల వ్యక్తికి, కాకినాడకి చెందిన 49 ఏళ్ళ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ రెండు కొత్త కేసులతో ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 23 కు చేరుకుంది. కొత్తగా కరోనా వైరస్ సోకిన వారికి ట్రావెలింగ్ హిస్టరీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఏపీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. నిన్న రాత్రి మొత్తం 33 మంది నమూనాలకు పరీక్షలు చేయగా 31 మందికి కరోనా నెగిటివ్ అని పరీక్షలలో తేలింది. ఇంకా వందమంది కరోనా అనుమానితుల నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.


ఇప్పటివరకు విశాఖపట్నంలో 6 కేసులు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4 కేసులు, ప్రకాశం జిల్లాలో 3 తూర్పుగోదావరి జిల్లాలో 3, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లా లలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. అయితే రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను, ప్రైవేట్ కాలేజీలను కోవిడ్ 19 చికిత్స కోసం ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.



ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి కారణంగా విశాఖకు చెందిన ఇద్దరికీ, గతంలో ఓ మహిళ కి కరోనా వైరస్ సోకింది. అయితే ముగ్గురికి కరోనా వైరస్ సోకేలా చేసిన ఈ వ్యక్తి ప్రస్తుతం కోవిడ్ 19 వ్యాధి నుండి పూర్తిగా రికవర్ అవ్వడం గమనార్హం. కరోనా వ్యాప్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్టడి చేసేందుకు ఎన్ని కఠినమైన చర్యలు చేపడుతున్నా... ప్రతిరోజు కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: