క‌రోనా వైర‌స్ ప్రపంచాన్నంతా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో వేలాదిమంది మరణించారు. ఇక దీని బారిన ప‌డి చికిత్స పొందుతున్న వారు ల‌క్ష‌ల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ మహమ్మారి కరోనా వైరస్ పై యుద్ధానికి ఇప్పుడు ఇస్రో రంగంలోకి దిగింది. ఇస్రో అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి రాకెట్ల ప్రయోగం, శాటిలైట్ల తయారీ. ఇప్పుడు ఆ శాస్త్రవేత్తల చేతులే కరోనా నియంత్రణలో భాగస్వామ్యం అయ్యాయి.

 

ప్రజల కోసం రాకెట్ల తయారీని పక్కన పెట్టారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ పై ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ఇస్రో రంగంలోకి దిగింది. శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారీలో నిమగ్నమైంది. వీటితోపాటు వెంటిలేటర్లు, మాస్కుల తయారీకి కూడా నడుం బిగించినట్లు ఇస్రో డైరెక్టర్ సోమ్ నాథ్ వెల్లడించారు. వెంటిలేటర్ ను కేవలం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిజైన్ చేస్తుందని ప్రకటించారు. ఇప్పటికే వెయ్యి లీటర్ల శానిటైజర్లను తయారు చేసి పంపిణీ కూడా చేసినట్లు వెల్లడించారు.

 

అదే విధంగా మాస్క్ ల తయారీలో మా ఉద్యోగులు బిజీగా ఉన్నట్లు కూడా తెలిపారు. ఇస్రో కంప్యూటర్లు అత్యంత సురక్షితమైనవని.. అదే విధంగా ఎంతో అడ్వాన్స్ డ్ గా ఉన్నాయన్నారు. వీటి ఆధారంగానే ఇంట్లో నుంచి కూడా పనులు చక్కబెడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా వెంటిలేటర్లను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా డిజైన్ చేసి.. అతి త్వరలోనే వైద్య శాఖకు అందించటం కూడా జరుగుతుందన్నారు.  ఇప్పటి వరకు ఇస్రో లో ఎవరూ కూడా కరోనా బారిన పడలేదని డైరెక్టర్ సోమనాథ్ ప్రకటించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

applehttps://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: