ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంది. ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రైవేట్ ఆస్పత్రులపై పూర్తి ఆజమాయిషీ ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా కట్టడికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులను వినియోగించుకునేలా విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
అందువల్ల బాధితుల సంఖ్య పెరిగినా వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ తక్షణమే ఈ ఉత్తర్వులను అమలులోకి తీసుకొచ్చింది. మరోవైపు రాష్ట్రంలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. 
 
రాజమండ్రిలో 72 ఏళ్ల వృద్ధుడికి, కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకేరోజు రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అధికారులు కరోనా వ్యాప్తి చెందకుండా మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ రెండు కేసులతో కలిపి రాష్ఱంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: