దేశం మొత్తం ఇప్పుడు కరోనా పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. ఈ మాయదారి వైరస్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశించింది.దీనితో   తెలంగాణలో  పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎటువంటి  అవసరం లేకుండా రోడ్ల మీదకి చాలు వస్తే చేమడాలు వలిచేస్తున్నారు. పోలీసులు ఒక పక్క మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే, లాఠీలకు కూడా  పని చెబుతున్నారు. ఎదురు తిరిగి ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 

 

 

మాట వినకుండా రోడ్డు మీదకి వస్తే  చాలు వాహనాలు సీజ్ చేస్తున్నారు. అయితే  లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 20 వేల వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 80 వేల  కొత్త  కేసులు  నమోదు అయ్యాయి.  సీజ్ చేసిన వెహికల్స్‌పై 188 సెక్షన్ ​కింద కేసు పెడుతున్నారు. చట్టాన్ని అతిక్రమించడం , ప్రజల జీవితాలకు,  ఆరోగ్యానికి, భద్రతకు భంగం కలిగించినప్పడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారంట. అయితే ఇలాంటి  కేసులు ఎక్కువ  హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.  సైబరాబాద్ కమిషనరేట్‌లోనే రోజూ 15వేల నుంచి 20వేల వెహికల్స్‌పై కేసులు పెడుతున్నారు. ఈ నెల 24న ఒక్క సైబరాబాద్ కమిషనరేట్‌లోనే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి అంటే  ప్రజలు చట్టాన్ని లెక్క చేయడం లేదని అర్ధం అవుతుంది. 

 

 

ఇలా ఇప్పటి వరకు ఈ కమిషనరేట్ పరిధిలో లక్ష వెహికల్స్‌పై కేసులు పెట్టారు. మిగతా కమిషనరేట్లలో 80 వేల వరకు కేసులు నమోదయ్యాయి. ఇలా లక్షల్లో కేసులు నమోదు అయ్యాయంటే ఎంత మంది ప్రజలు లాక్ డౌన్ ని పాటించకుండా భాద్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో అర్ధం అవుతుంది. ఇలాగే కొనసాగితే వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టం అని అధికారులు భావించి చట్టాన్ని ఇంకా  కఠినతరం చేస్తున్నారు. పోలీసులు లాఠీలకు ఇంకా పని పెడుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple :  https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: