ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ గగ్గోలు పుట్టిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధితో కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. చైనా పుట్టిన ఈ వ్యాధి 14రోజులోనే ప్రపంచమంతటా వ్యాపించింది. అగ్రరాజ్యమైన అమెరికా కూడా వ్యాధిని కట్టి చేయలేక చేతులు ఎత్తేసింది. ప్రస్తుతం చైనా ఈ వ్యాధి కొంత వరకు కంట్రోల్ చేసుకొచ్చింది. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుంది. కరోనాకి అడ్డుకట్ట వేయడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసిందే.


తెలంగాణలో కరోనా ప్రభావం ఎక్కువగానే ఉన్నది. ఇప్పటికే కరోనా వ్యాధితో ఒక్కరు మరణించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 70కరోనా కేసులు నమోదైయ్యాయి.  తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో 62 ఏళ్ల వృద్ధుడు చనిపోయారు. అయితే చనిపోయిన వృద్ధుడు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మిత్రుడు. 

 

దింతో అక్కడి సిబ్బందికి వృద్ధుడు మరణం పై పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా మృతుడు బంధువులు వైద్య సిబ్బంది కారణంగానే వృద్ధుడు మరణించాడని హాస్పిటల్ ముందు నిరసనకు దిగారు. మరికొంత మంది వైద్య సిబ్బందిపై దాడికి చేయడానికి ప్రయత్నించారు.

 

వివరాల్లోకి వెళ్తే... వృద్ధుడు ఆరోగ్యం బాగా లేదని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ఆ వృద్దుడి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున అతనిని హుటాహుటిగా హైదరాబాద్ కు తరలించాలని వైద్య సిబ్బంది తెలిపారు. మార్గం మధ్యలో వృద్దుడుకి  గుండెపోటు వచ్చిందని, దీనివల్లే అతను మరణించాడని వైద్యులు వెల్లడించారు.

 

వృద్ధుడు చనిపోయాడన్న వార్త తెలిసిన మృతుడి సంబంధిత బంధువులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని ఏడ్చారు. వీరు ఏడ్చే సమయంలో మృతదేహాన్ని తాకుతూ విలపించారు. చనిపోయిన వ్యక్తి కరోనా అనుమానితుడు. వైద్య సిబ్బంది చనిపోయిన వ్యక్తిని ముట్టుకోకుండా ఉంచేందుకు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఈ వ్యక్తిని ముట్టుకున్న 11మంది వ్యక్తులను ఐసోలేషన్‌ వార్డుకుకు తరలించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: