ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. అమెరికా, ఇటలీ, జర్మని, స్పెయిన్, ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. దాదాపు అన్ని దేశాల్లోను కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ఇప్పుడు ప్రజలు ప్రాణ భయంతో అల్లాడే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఏ చర్యలు తీసుకున్నా అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. 

 

ఇటలీలో మరణాల సంఖ్యా 11 వేలకు దగ్గరలో ఉంది. అమెరికాలో మరణాల సంఖ్య మూడు వేలకు దగ్గరగా ఉండగా ఒక లక్షా 42 వేల మంది బాధితులు ఉన్నారు. ఇటలీ, స్పెయిన్ లో బాధితుల సంఖ్య తగ్గినట్టే తగ్గి క్రమంగా పెరుగుతుంది. జర్మనిలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది అక్కడి ప్రభుత్వాన్ని. ఇక మన దేశంలో కరోనా వైరస్ దాదాపుగా 1100 మందికి సోకింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య 23 కి చేరుకుంది. 

 

రాజమండ్రి కాకినాడ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణాలో 70 కేసులు నమోదు కాగా 11 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్ర కర్ణాటక, కేరళలో కరోనా క్రమంగా పెరుగుతుంది. కేరళలో కరోనా కేసుల సంఖ్య 200కి దగ్గరలో ఉంది. మహారాష్ట్రలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ 250 కి చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఏపీలో, తెలంగాణాలో ప్రభుత్వాలు చాలా వరకు కరోనా విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: