క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. భారత్‌లోనూ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు  పెరుగుతోంది.  కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లోని ప్రజలు మరింత భయాందోళనలకు లోనవుతున్నారు. ఇక ఇప్ప‌టికే భార‌త్‌లో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1024 నమోదవ్వగా.. వాటిలో 96 కేసులు రికవరీ అయ్యాయి. కొన్ని కేసుల్లో పేషెంట్లను డిశ్చార్జి కూడా చేశారు. ఇక కరోనా వైరస్ మహమ్మారి తాకిడికి ఒడిశా చాలా దూరంలో ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం మూడు కేసులే న‌మోదు అయినా.. ప్రజల్లో భయం మాత్రం ఎక్కువగానే ఉంది. 

 

ఇదిలా ఉంటే.. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఓ యువ మహిళా డాక్టర్.. ఓ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్‌లో ఉంటోంది. అయితే ఒడిశాలో క‌రోనా కేసులు స్టాట్ అవ్వ‌డంతో ఆ ఫ్లాట్‌లో వాళ్లంతా స‌ద‌రు డాక్టర్‌ను అదోలా చూడటం మొదలుపెట్టారు. కొంతమందైతే సొసైటీ ఆఫీస్ బేరర్ దగ్గరకు వెళ్లి స‌ద‌రు డాక్ట‌ర్ వ‌ద్ద‌కు ఎంద‌రో పేషెంట్లు వ‌స్తారు. అందులో ఎవ‌రికైనా క‌రోనా ఉంటే.. ఆది ఆమెకు.. ఆమె నుంచి మాకు వ‌చ్చేస్తుంది. కాబ‌ట్టి.. మీరేం చేస్తారో మాకు తెలీదు... ఆమె మాత్రం ఫ్లాట్ ఖాళీ చేసేయాలి అంటూ హెచ్చ‌రించ‌డం ప్రారంభించారు. అయితే స‌ద‌రు బేరర్ సైతం ఆమెను పంపించేస్తాన‌ని వాళ్ల‌కు హామీ ఇచ్చారు.

 

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు బేర‌ర్‌, అత‌ని భార్య కలిసి.. ఆమెను ఖాళీ చెయ్యమని ఒకటే న‌స పెడుతూ వ‌చ్చారు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్న ఆమె ఖాళీ చెయ్యకపోవడంతో... బేర‌ర్‌ ఆమె ఫ్లాట్‌కి వెళ్లి.. ఇదిగో నా సంగతి నీకు తెలీదు... అసలే ఒంటరిగా ఉంటున్నావ్... నాకసలే అమ్మాయిల పిచ్చి... అయిపోతావ్ అని బెదిరించాడు. దీంతో ఆమెకు చిరెత్తుకొచ్చి పోలీసుల‌కు ఆశ్ర‌యించింది. వారం నుంచి తనను బెదిరిస్తున్నాడనీ, ఇప్పుడు ఏకంగా అత్యాచారం చేస్తానంటున్నాడని తెలిపింది. దీంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేశారు. మ‌రోవైపు సొసైటీ మొత్తం ఆ డాక్టర్‌పై కేసు పెట్టింది. ఆమె ఆఫీస్ బేరర్‌తో అమర్యాదగా ప్రవర్తించిందని కంప్లైంట్‌లో తెలిపారు. ఇక‌ పోలీసులు ప్ర‌స్తుతం రెండు కేసుల్నీ దర్యాప్తు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: