ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న కొరోనా వైరస్ పంజా మనదేశం మీద కూడా ప్రతాపం చూపిస్తోంది. దేశం మొత్తం మీద 1024 కొరోనా వైరస్ కేసులు నమోదైతే రెండు రాష్ట్రాల్లో మాత్రమే 430 కేసులు నమోదయ్యాయి. మొదటి నుండి కూడా ఈ రెండు రాష్ట్రాలే కొరోనా వైరస్ కేసుల విషయంలో చాలా స్పీడుగా ఉంది. ఇంతకీ ఆ రెండు రాష్ట్రాలేవంటే మహారాష్ట్ర, కేరళ.

 

అసలు కొరోనా వైరస్ దేశంలో బయటపడిందే మొదటిసారి కేరళలో. ఆ తర్వాత వరుసగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే ఏమయ్యిందో ఏమో ఒక్కసారిగా మహారాష్ట్రలో కేసులు వరుసగా బయటపడ్డాయి. దాంతో రెండు రాష్ట్రాలు కేసుల విషయంలో ఒకదానితో మరొకటి పోటి పడుతునే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మహారాష్ట్రలో 220 కేసులు, కేరళలో 210 కేసులు బయటపడ్డాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇటు మహారాష్ట్ర అయినా అటు కేరళ అయినా విదేశీయులు ఎక్కువగా ఉండే రాష్ట్రాలే. ముంబాయితో పాటు కేరళలోని అనేక బీచులు, ప్రకృతి వైద్యశాలల్లో చేరేందుకు విదేశీయులు ప్రధానంగా గల్ఫ్ దేశాల నుండి చాలా ఎక్కువగా వస్తుంటారు. బహుశా ఈ కారణంగానే పై రెండు రాష్ట్రాల్లోనే రోగుల  సంఖ్య ఎక్కువగా ఉందనే అనుకోవాలి. మహారాష్ట్రలో ఎనిమిది మంది చనిపోగా కేరళలో ఒక్క రోగి చనిపోయాడు.

 

అప్పటికి ముంబాయ్, కేరళలో వైద్య సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ ఇపుడు సోకిన కొరోనా వైరస్ కు మందు లేకపోవటంతో ప్రభుత్వాలకు ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా దేశంలో 27 మంది చనిపోవటం నిజంగా బాధాకరమే. వైద్యం లేని వైరస్ కాబట్టే నివారణ ఒక్కటే మార్గమని యావత్ ప్రపంచం మొత్తుకుంటోంది. కాబట్టి మనదేశంలో కూడా  ఈ విషయంలో కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఇంత గట్టి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు కాబట్టే వైరస్ ఇంత అదుపులో ఉంది లేకపోతేనా ? ...

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: