కరోనా ను కట్టడి చేసే విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం లేకుండా చేసేందుకు నివారణ చర్యలు తీసుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటికే ఈ విషయంలో కేసీఆర్ చాలా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

IHG


 ఈ సందర్భంగా కేసీఆర్ ఉన్నత స్థాయి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఆర్థిక పరిస్థితి గురించి కేసీఆర్ ను ప్రశ్నించడంతో దీనికి సమాధానంగా కేసీఆర్ స్పందిస్తూ తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, తప్పని పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల లో కోతలు పెట్టే అవకాశం ఉంది అన్నట్లుగా కేసీఆర్ స్పందించారు. అలాగే ఎమ్మెల్యేల జీతాలకు కూడా కోతలు విధిస్తామనే విధంగా కెసిఆర్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ...

 

IHG


రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసి పంచుకుంటే భారం తగ్గుతుందని, మార్చి 15వ తేదీ నుంచి ఎక్సైజ్, పెట్రోల్, జిఎస్టి ఇలా మొత్తం అన్ని రకాల ఆదాయాలు తగ్గిపోయాయని, పరిస్థితి ఇలా ఉంటే ఆర్థిక పరిస్థితి ఎక్కడ బాగుంటుంది అంటూ కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి మెరుగ్గా మారాలంటే కేంద్రం నిధులు రావాల్సి ఉందని అన్నారు. ఏపీ పరిస్థితి ఆర్థికంగా మెరుగయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని, ఈ విపత్తు నుంచి గట్టెక్కే వరకు అందరూ ఊపిరి బి పట్టుకుని ఉండాలన్నారు. ఉద్యోగుల జీతాలను కోత పడే అవకాశం ఉన్నట్టుగా కెసిఆర్ వ్యాఖ్యలను బట్టి తేలిపోవడంతో అసలు అరకొరగా ఆయన జీతాలు ఇస్తారా లేక పూర్తిగా త్యాగం చేయాలని చెబుతారా అనే సందేహాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: