ఇప్పటికే ఈ కోవిడ్ 19 వల్ల దేశం అంత లాక్ డౌన్ లో ఉన్న సంగతి చూస్తున్నదే. ప్రజలు ఎవ్వరు కూడా బయటకి రాకుండా ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. కరోనా ఇప్పటికే ఓపిక పట్టలేని అంత బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ కరోనా వల్ల  అన్ని దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు . ప్రపంచాన్నే ఈ కరోనా భయానికి గురి చేస్తోంది . అన్నీ దేశాలు దాటి ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారు .

 

 

ప్రజలు కూడా సెల్ఫ్ క్వారంటైన్ అవుతున్నారు. ఎప్పటికి అప్పుడు శుభ్రంగా ఉంటూ చేతులు కడుక్కుని క్లీన్ గా ఉంటూ పలు చర్యలని కూడా పాటిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని మన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వంతు సాయం చెయ్యాలని ముందుకి సతీమణి తో సహా  వచ్చాడు. పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వాలని నేను ఇంకా అనుష్క నిర్ణయించుకున్నాం అని కోహ్లీ చెప్పాడు .

 

 

''వారి బాధ చూస్తుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి. మేము చేసే సాయం తోటి పౌరులకు బాధ నుండి విముక్తి కలిపిస్తుంది అని ఆశిస్తున్నాం అని విరాట్ కోహ్లీ చెప్పాడు. అయితే కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడకుండా కేంద్రానికి, రాష్ష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ సెలబ్రెటీ నుండి సామాన్యుల వరకు కూడా సహాయం అందించడం నిజంగా గొప్ప విషయం.

 

 

సహాయం చేస్తూ వారి ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు. అయితే ఎంత ఇష్టం అన్నది ఇంకా కోహ్లీ చెప్పలేదుట. కానీ మంచితనంతో కోహ్లీ  అనుష్క రావడం మంచి విషయమే. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్, హిమదాస్ విరాళాలు  అందించారు. 

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: