ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికి పోతుంటే.. ఓ దేశం మాత్రం నా మానాన నేను వెళ్తాను.. నన్నెవరూ ఆపలేరన్నట్లుటా ఆయన పనులు చేసుకుంటూ పోతున్నారు.  ఉత్తర కొరియా మాత్రం ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తూ కవ్వింపు చర్యలకు దిగింది. వోన్సాన్‌ పట్టణం నుంచి సీ ఆఫ్‌ జపాన్‌ పై క్షిపణులను ప్రయోగించింది. దేశంలోని ఈస్ట్‌కోస్ట్ ఏరియాలో రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఈ విష‌యాన్ని సౌత్‌కొరియా అధికారులు ధృవీక‌రించారు.

 

దీంతో ఈ నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు బాలిస్టిక్ ప‌రీక్ష‌లు ఉత్త‌ర‌కొరియా జ‌రిపింది. కాగా ఉత్త‌ర‌కొరియాలో ఇప్ప‌టి వ‌రకు ఎన్ని క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయో ప్రపంచానికి తెలియ‌దు.  సూపర్‌ లార్జ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్లను కూడా కిమ్ సేన పరిశీలించినట్టు తెలుస్తోంది. జపాన్‌, కొరియా, రష్యాల సరిహద్దులో ఉన్న ద్వీపం లక్ష్యంగా ఆదివారం ఈ రాకెట్ లాంచర్ల ప్రయోగం జరిగిందని సమాచారం. క్షిపణి ప్రయోగాలు ఎప్పుడు జరిగినా, హాజరై, వాటిని ప్రత్యక్షంగా తిలకించే దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈదఫా మాత్రం రాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. 

 

కాకాపోతే ఈ సారి ఆయనకు బదులుగా అధికార పార్టీ ఉపాధ్యక్షుడు రీ ప్యాంగ్‌ చోల్‌ ప్రయోగాలను పర్యవేక్షించారని పేర్కొంది.  కాగా, ఈ పరీక్షల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా తెలుసునని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జపాన్ ప్రత్యేక ఎకనామిక్‌ జోన్‌ కు అతి దగ్గరలోనే క్షిపణులు ల్యాండ్‌ అయ్యాయని గుర్తించామని అన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: