కరోనా వైరస్ విస్తరణ కాదు కాని ఇపుడు ఏ వార్త విన్నా భయమే వేస్తోంది. ఆశాజనకమైన వార్తలు కాదు, భయం కలిగించేవే అంతటా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా అయితే మహా భయంకరంగా  మారింది. అక్కడ ఎందుకో భయాన్నే ఆయుధంగా మార్చుకున్నారు. అందరినీ ఒక్క లెక్కన బెదరగొడుతున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంచితే తెలంగాణా సీఎం కేసీయార్ కరోనాని అరికట్టే విషయంలో ఒక పద్ధతిగా పనిచేసుకుపోతున్నారు. ఆయన చాలా వేగంగా స్పందించి కరోనాపై కఠోరమైన  యుధ్ధం చేస్తున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి  వచ్చిన వారిని ఎక్కడికక్కడ క్వారంటైన్స్ చేశారు. ఇది పదిహేను రోజుల ముందే మొదలైంది.

 

ఇపుడు పద్నాలుగు రోజులు పూర్తి చేసుకున్న వారి విడుదల కూడా ఒక  షెడ్యూల్ ప్రకారం చేస్తున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 వరకూ  ప్రతీ రోజుకు  వేయి నుంచి రెండు వేల మంది వంతున క్వారంటైన్స్ నుంచి  ప్రతీ రోజూ విడుదల చేస్తారట. ఆ విధంగా ఏప్రిల్ 7 నాటికి కరోనా వ్యాధికి సంబంధించి ఎవరూ లేకుండా చేయాలన్నది కేసీయార్ ఆలోచనగా ఉంది.

 

మొత్తానికి క్రమపద్ధతి ప్రకారం కేసీయార్ కరోనా కట్టడికి చేస్తున్న ఈ పనుల కారణంగా ఏప్రిల్ 7 తరువాత కరోనా విముక్తిని పొందిన తొలి రాష్ట్రంగా తెలంగాణా ఉంటుందని అంటున్నారు. తెలంగాణాకు వచ్చిన కరోనా కేసులన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారివే కావడంతో కేసీయార్ వారందరినీ మొత్తం రాష్ట్ర జనాభా నుంచి బాగానే విడదీయగలిగారని అంటున్నారు.

 

దాంతో లోకల్ గా  ఉంటున్న వారికి ఈ వ్యాధి అంటకుండా  కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదే విధంగా లాక్ డౌన్ ని కూడా ప్రభుత్వం బాగా  ఉపయోగించుంది. మొత్తానికి కేసీయార్ శ్రమ ఫలిస్తే కరోనాని తరిమేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణా రికార్డు సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: