అమెరికా ప్రజల్లో కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలు నింపుతోంది. ఇక్కడ గత మూడు రోజుల్లోనే మృతుల సంఖ్య రెట్టింపవడం మరింత వణికిస్తోంది. గురువారం 1000గా ఉన్న మరణాల సంఖ్య నేటి ఉదయానికి ఏకంగా 2,211కు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.  మృతుల సంఖ్య భారీగా ఉండటం మరింత కలవరపరుస్తోంది. కరోనా పంజా విసురుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

 

ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సోషల్ జస్టిస్ ను పాటించాల్సిందేనని సూచించారు.  కరోనా కట్టడికి అగ్రరాజ్యం ఇప్పటికే  వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా మరింత కేటాయించింది. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ వైద్య రంగానికి ప్రధాని మోదీ రూ. 15 వేల కోట్ల నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని అదనపు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, ఐసీయూ బెడ్స్, మెడికల్ బెడ్స్, మెడికల్, పారా మెడికల్ వైద్య సిబ్బంది కోసం ఖర్చు చేస్తామని తెలిపారు.  కారోనా వల్ల ఇప్పటి దేశ వ్యాప్తంగా విపరీతమైన మరణాలు సంబవిస్తున్న విషయం తెలిసిందే.  

 

మరికొన్ని వారాల్లో దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయని ఇటీవల ఓ సందర్భంలో అభిప్రాయపడ్డ ట్రంప్‌ ఇప్పుడు ఆ మాటల నుంచి వెనక్కితగ్గడం అక్కడి పరిస్థితి తీవ్రతకు తెలియజేస్తోంది. ఈస్టర్‌ పర్వదినం నాటికి అంతా సర్దుకోవాలని తాను ఆశించానన్నారు. ఈ వైరస్‌ బెడద ఇప్పుడిప్పుడే తొలగిపోయేలా కనిపించడం లేదన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

  

మరింత సమాచారం తెలుసుకోండి: