కరోనా మహమ్మారి ప్రపంచానికి ఓ శనిలా దాపురించింది. వారు.. వీరు.. అనే తేడా లేకుండా.. అందరినీ పొట్ట పెట్టుకుంటుంది... ఇటీవల కరోనా వైరస్ కారణంగా.. తెలంగాణాలో చనిపోయిన 75 ఏళ్ళ వృద్దుడికి, కాసేపటి క్రితమే... అంత్య క్రియలు నిర్వహించారు... వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు లేకుండానే... తప్పని సరి పరిస్థితులలో అక్కడి వైద్య బృందం ఈ కార్యక్రమాన్ని కానిచ్చేశారు.

 

అత్యంత దయనీయ పరిస్థితులలో మృతుల కార్య కలాపాలు చేయడం.. బాధ కరం అయినప్పటికి... ఇది తప్పని పరిస్థితి... ఇక లాంగ్ టైం లాక్ డౌన్ నేపథ్యంలో కొంతమంది యువకులు వారి ఇళ్లల్లో ఉండలేక... రోడ్లమీదకు వచ్చి, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినడం మనం చూస్తూనే వున్నాం. లాక్ డౌన్ విషయంలో మాత్రం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకింత కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. అందువలననే ఇక్కడ పరిస్థితి  కొంచెం ఆశాజనకంగా వుంది.

 

ఇక నిన్న మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మన దేశ ప్రధాని మోడీ... కరోనా వైరస్ పైన పోరాటంలో భారత్ తప్పక గెలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు. అయన ప్రస్తావిస్తూ.... లాక్ డౌన్ నిబంధనలు మాత్రం ఉల్లంఘించ వద్దని, అలా ఐతే మనం ఈ పోరులో విజయం సాధించలేమని... దేశ ప్రజలకు సూచించారు. ఇక ఇందులో భాగంగా ఇండ్లలో ఖాళీగా వున్నవారిని సమయం వృధా చేయకుండా... యోగా, మెడిటేషన్ అలవాటు చేసుకొమ్మని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక పోతే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు ఇలా వున్నాయి... 

 

వరల్డ్ వైడ్ బాధితుల సంఖ్యా  - 7, 34 , 998
మరణాల సంఖ్య - 34, 781
రికవరీ కేసుల సంఖ్య - 1, 55, 965

 

ఇండియాలో కేసుల సంఖ్య - 1, 071
మరణాల సంఖ్య - 29
పాజిటివ్ కేసుల సంఖ్య - 100

 

తెలంగాణలో మొత్తం కేసులు - 70
మృతులు - 1
ఏపీలో మొత్తం కేసులు - 21
మృతులు – 0

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: