ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్నారైలను ఎంతో ప్రత్యేకంగా చూసేవారు. ఎన్నారైల నుంచి విదేశాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవటానికి గ్రామాల్లో, నగరాల్లో ప్రజలు ఎంతో ఆసక్తి చూపేవారు. కానీ దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటం... రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా సోకుతుందని ఆరోపణలు చేస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా ఎన్నారైలకు ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. 
 
విదేశాల నుంచి వచ్చారంటే ఆ ఇంటి గడప తొక్కడానికి కూడా ఎవరూ ఇష్టపడని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చారంటే వారికి గౌరవ మర్యాదలు దక్కేవీ కానీ ఇప్పుడు వాళ్లను దొంగలను చూసినట్టు చూస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. దీనికి కారణం కూడా విదేశాల నుంచి కొందరు వ్యక్తులు కావడం గమనార్హం. ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాయి. 
 
కానీ కొందరు విదేశీయులు థర్మల్ స్క్రీనింగ్ లో దొరకకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడంతో తప్పించుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు కుటుంబ సభ్యులతో గడపటం, లక్షణాలు ఉన్నా బయటకు చెప్పకపోవటం వల్ల వైరస్ వ్యాప్తి చెందింది. దేశం మొత్తంలో 15 లక్షల మందికి పరీక్షలు చేస్తే వారిలో 1000 మందిలో మాత్రమే కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. 
 
కొన్ని గ్రామాలలో ఇతర దేశాల నుంచి వచ్చారంటే వారిని గ్రామ పొలిమేరల దగ్గర ఆపేస్తున్నారు. వారిని గ్రామంలోకి కూడా అనుమతించటం లేదు. మరికొన్ని చోట్ల వారిని ఘోరంగా అవమానిస్తున్నారు. ప్రజలు ఇది సరైన పద్ధతి కాదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 1079 పాజిటివ్ కేసులు నమోదు కాగా 29 మంది మృతి చెందారు. తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 23 కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: