దేశవ్యాప్తంగా గత వారం రోజుల నుండి లాక్ డౌన్ చాలా పటిష్టంగా నిర్వహిస్తుండడంతో దుకాణాలు పొరపాటున కూడా తెరుచుకోవట్లేదు. వైన్ షాపులు చాలా కట్టుదిట్టంగా మూసివేయడంతో మందుబాబులు మద్యం లేక అల్లాడిపోతున్నారు. కనీసం బ్లాక్ మార్కెట్ కూడా కొనసాగకుండా అధికారులు చాలా పటిష్టంగా పని చేస్తున్నారు. పేద, ధనిక, విఐపి అన్న తేడా లేకుండా మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సాధారణ రోజుల్లో ఏరులై పారుతున్న మద్యం ఇప్పుడు కనుమరుగు కావడంతో రోజూ నిద్రపట్టని బాధితులు ఇళ్ళల్లో ఉండలేకపోతున్నారు.

 

ప్రతిరోజు ఖచ్చితంగా మందు తాగే వారు ఇప్పుడు మందు లభించకపోవడంతో వారి మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందు లేక చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటే వారికి పిచ్చి పట్టిందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం మందుకు అలవాటుపడిన శరీరం ఒక్కసారిగా దొరకకపోతే అప్పటికీ వారి మానసిక పరిస్థితి సక్రమంగా పనిచేయడం లేదు. చాలా వింతగా పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఎన్నో ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కారణంగా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి లో బాధితులు పెరిగిపోతున్నారు.

 

మూడు రోజులుగా ఆస్పత్రికి ఓపీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 100 కేసులు నమోదయ్యాయి. మందు లభించక వింతగా ప్రవర్తిస్తున్నారని స్థానిక వైద్యుల సలహాతో కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అలా చేరుకున్న వారికి వైద్యులు పరీక్షిస్తున్నారు. వారి మానసిక పరిస్థితి విధంగా మారడానికి కారణాలు తెలుసుకుంటున్నారు. మేరకు బాధితులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. విధంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్ని గంటల పాటు వైన్స్ షాపులు తెరవాలి అన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: