దేశమంతా విస్తృతంగా పాకిపోతున్న కవిడ్-19 వల్ల, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే, మరో పక్క మరణాలు కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నాయి.  తాజాగా మహారాష్ట్రలో తొమ్మిదో కరోనా మరణం నమోదైంది. పూణేలో 52 ఏళ్ల వ్యక్తి, కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇదే పుణేలో నమోదైన తొలి కరోనా మరణమని ఆ నగర మేయర్ మోహోల్ తెలిపారు. అతనికి డయాబెటిస్, బీపీ సమస్యలు కూడా ఉన్నాయన్నారు. మరణించిన వ్యక్తికి సంబందించిన వారిని నగరంలోని ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారని చెప్పారు.

 

 

తాజాగా మహారాష్ట్రలో కొత్తగా 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 215కు చేరింది. అంతే కాకుండా మహారాష్ట్రంలోని సంగ్లీలో, ఒకే కుటుంబంలోని 25 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక పక్క గుజరాత్‌లో కూడా 45 ఏళ్ల మహిళ కరోనా వల్ల మృతి చెందింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. గుజరాత్‌లో 69 మంది మాత్రమే కోవిడ్-19 బారిన పడినప్పటికీ, వారిలో ఆరుగురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోవిడ్ మరణాల ఎక్కువగా ఉంది గుజరాత్‌లోనే.

 

 

మరో వైపు అహ్మదాబాద్‌లో కూడా కరోనా కారణంగా ముగ్గురు చనిపోయారు. భావ్‌నగర్‌లో ఇద్దరు, సూరత్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బెంగాల్‌లోనూ ఓ మహిళ కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. దీంతో బెంగాల్‌లో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశమంతా లాక్ డౌన్ పాటిస్తున్నా కానీ ఇలా జరగడం కాస్త ఆందోళనకరంగా ఉంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఇంకా పొడిగిస్తేనే మంచిదని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: