ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌.. భార‌త్‌లోనూ రోజురోజుకు వేగాన్ని పెంచుకుంటుంది. దీంతో లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం... అన్ని రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులనూ మూసేయాలని ఆదేశించింది. పైగా లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని ఆర్డరేసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి పెరిగింది. కరోనాతో 29మంది చనిపోయారు. 942మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 100మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే క‌రోనా తీవ్ర‌త మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్ లో ఎక్కువ‌గా ఉంది. 

 

అయితే ముఖ్యంగా క‌ర్ణాట‌క‌లో  కరోనా కేసుల సంఖ్య 85కి చేరగా, ముగ్గురు చనిపోయారు. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో అక్క‌డ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదిలా ఉంటే.. క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న క్ర‌మంలో.. వైద్యులను రవాణా చేయడానికి మరియు క‌రోనా బాధితుల కోసం ఓలా క్యాబ్స్ 500 వాహనాలను క‌ర్ణాట‌క‌ ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీక‌రించ‌ద‌ట‌. ఈ మేర‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్ సోమవారం వెల్ల‌డించారు.

 

ఇక ఇప్ప‌టికే కరోనా వైరస్ దృష్ట్యా తమ కార్లలో అత్యంత పరిశుభ్రత పాటిస్తున్నామన్న ఓలా... వెహికిల్స్‌తోపాటూ... ప్లాట్‌ఫామ్స్ దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇకపై తమ క్యాబ్‌లలో ప్రయాణించేవారు ఒక్కరు లేదా... ఒకే కుటుంబానికి చెందిన వారే ప్రయాణించేలా చేస్తున్నామని వివరించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 34వేల మంది మరణించారు. కరోనా కేసుల సంఖ్య 7, 23,643కి పెరిగింది. ఇప్పటివరకు లక్ష 51వేల 4 మంది కోలుకున్నారు. అయితే యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: