కొరోనా వైరస్ దెబ్బకు ఇద్దరు ఐఏఎస్ అధికారులపై కేంద్రప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉండిపోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడి జనాలకు అప్పీల్ చేశారు. అయితే లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ఢిల్లీలో ఉన్న వేలాది మంది జనాలు తమ సొంతూర్లకు బయలు దేరటంతో సమస్య పెద్దదైపోయింది.

 

ప్రధాని లాక్ డౌన్ ప్రకటించినపుడు ఓ ప్రాంతం వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లే ఢిల్లీలో కూడా వేలాది మంది వలస కూలీలు ఇరుక్కుపోయారు. దాంతో వాళ్ళంతా ఢిల్లీలో ఉండలేక తమ ఊర్లకు వెళ్ళలేక అవస్తలు పడ్డారు. ఒకటి రెండు రోజులు ఎలాగో నెట్టుకొచ్చినా తర్వాత ఉండలేకపోయారు. దాంతో వేలాదిమంది వలస కూలీలు చుట్టు పక్కలున్న తమ సొంతూర్లకు గుంపులు గుంపులుగా బయలుదేరేశారు.

 

వేలాదిమంది ఒక్కసారిగా తమ సొంతూర్లకు బయలు దేరటంతో లాక్ డౌన్ స్పూర్తి దెబ్బ తినేసిందని ప్రధానమంత్రి ఒళ్ళు మండిపోయింది. వలసకూలీలను కట్టడి చేయలేకపోయారంటూ ఇద్దరు ఐఏఎస్ అధికారులపై కేంద్రప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఢిల్లీ రవణా శాఖ అదనపు ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్ధిక శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీకి ముందుగా షోకాజ్ నీటీసు ఇచ్చి తాజాగా సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

 

వీళ్ళతో పాటు హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, సీలంపూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కు వలసకూలీల ప్రయాణాలపై సమాధానాలు ఇవ్వాలంటూ షోకాజ్ నీటిసు ఇచ్చింది.  మొత్తం మీద ఆదేశాలను పాటించని వాళ్ళపైన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వాళ్ళపై కొరడా ఝుళిపించటం మొదలైందనే చెప్పాలి. కేంద్రప్రభుత్వంలోని ఐఏఎస్ అధికారులపై చర్యలు మొదలుపెట్టిన తర్వాత ఇపుడు రాష్ట్రప్రభుత్వంలోని అధికారులపైన కూడా కొరడా విసరకుండా ఉంటారా ? కాబట్టి ప్రభుత్వం ఆదేశాలను పాటించటం ఒకటే మార్గం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: