ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఐతే కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడం... అన్ని దేశాలు లాక్ డౌన్ ఎత్తివేయడం... మళ్ళీ ప్రజల విదేశీ ప్రయాణాలు జరగడం మొదలవుతాయి. కానీ అత్యంత అవసరాలు ఉన్న వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు మాత్రమే విదేశీ మార్గాల ద్వారా ప్రయాణాలు చేసేందుకు సిద్ధం అవుతారని మనం చెప్పుకోవచ్చు. మరికొంత మంది ప్రజలు మాత్రం మనసులో ఏదో ఒక మూలన కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఇళ్లకే పరిమితం అవుతారు. కాస్త ఎక్కువగా రిస్క్ తీసుకునే వారు మాత్రం లాక్ డౌన్ లు అన్నీ ఎత్తివేసిన తరువాత ప్రదేశాలు ఎలా ఉన్నాయో చూసేందుకు ప్రయాణాలు చేస్తుంటారు.




ఐతే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రెస్టారెంట్లలో గానీ, ప్రజారవాణా వాహనాల్లో గానీ అత్యంత శుభ్రత దర్శనం అయ్యే అవకాశం ఉంది. హ్యాండ్ శానిటైజెర్లు, సబ్బులు ఇంకా ఇతర పరికరాలు ప్రజలు వెళ్ళిన ప్రతి ఒక్క చోట కనిపించడం జరుగుతుంది. కరోనా మహమ్మారి దయవలన ఎక్కడా చూసిన పరిశుభ్రత కనిపించడంతో పాటు నమస్కార్ ఆచారం ఉట్టిపడుతుంది. విమానాలలో ఎవరు ఎక్కువగా ప్రయాణించడానికి ఇష్టపడరు. దాంతో విమాన టికెట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది.




సో, లాక్ డౌన్ ఎత్తేసిన వెనువెంటనే సామాన్యులు కూడా విమానంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇకపోతే హోటల్స్ లలో కూడా ఎవరు బస చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. దాంతో లగ్జరీ హోటల్స్ యొక్క రూం రేట్లు కూడా బాగా తగ్గిపోతాయి. హోటల్స్ లలో శుభ్రత కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ప్రజా రవాణా చేసే బోటులు, ఇంకా నౌకల టికెట్ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. చాలా దుకాణాలలో వస్తువులు కూడా చౌకైన ధరకే లభించే అవకాశం ఉంటుంది. ఏది ఏదైనా కొంతమంది ధైర్యవంతులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎక్కువగా ట్రాఫిక్ లేని ప్రపంచం లోకి అడుగుపెట్టేందుకు తహతహలాడతారని నిపుణులు చెబుతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: