కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.

 


- ప్ర‌ముఖ ఔష‌ధ సేవ‌ల సంస్థ‌ హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్) కూడా ప్రభుత్వానికి అందించారు. చెక్కును ముఖ్యమంత్రికి, మందులను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్‌కు హెటిరో చైర్మన్ పార్థసారధి రెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 
-  తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్‌పెక్టర్ అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ అధ్యక్షుడు కె.పాపారావు తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. 
- సువెన్ ఫార్మా కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి ముఖ్యమంత్రికి అందించారు
- ఎన్.సి.సి. లిమిటెడ్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి ఎ. రంగరాజు ముఖ్యమంత్రికి అందించారు
- శ్రీ చైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయల విరాళం అందించాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ వై.శ్రీధర్ ముఖ్యమంత్రికి అందించారు. కాగా, వివిధ సంస్థ‌లు ఉదారంగా ముందుకు వ‌చ్చి చేసిన స‌హాయం ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 

 

ఇదిలాఉండ‌గా, రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా కట్టడి అవుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపిన సంగ‌తి తెలిసిందే. గండం నుంచి పూర్తిగా బయటపడినట్లు కాదని.. ఏ క్షణం ఎలా మారుతుందో తెలియదని అన్నారు. ప్రజలంతా చాలా తీవ్రమైన క్రమశిక్షణతో లాక్‌డౌన్‌ పాటించి ప్రభుత్వానికి సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడుతామని పేర్కొన్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని.. వారు సోమవారం డిశ్చార్జి అవుతారని చెప్పారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా కష్టపడుతున్నారని కొనియాడారు. కరోనాపై దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నవారిపై కఠినాతి కఠినంగా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. శవాలపై పేలాలు ఏరుకొనే చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: