క‌రోనా వైర‌స్‌(కోవిడ్-19).. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపిస్తోంది.  కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర‌స్ సోకి 34వేల మంది మరణించారు. కరోనా కేసుల సంఖ్య 7, 23, 643కి చేరుకుంది. అయితే క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది. క‌రోనాకు నివార‌ణ ఒక్క‌టే మార్గంతో.. దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించారు. ఇక క‌రోనా ప్ర‌భ‌వం అన్ని రంగాల‌పై ప‌డి అత‌లాకుత‌లం అవుతున్నాయి.

 

ఇదిలా ఉంటే.. బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐపై మూడు నెలల మారటోరియం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు విషయంలోనూ ఇదే పంథా అనుసరించింది. క‌రోనా మ‌హ‌మ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్‌బీఐ కూడా పలు కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కరెంటు బిల్లు చెల్లింపులకు సంబంధించి అన్ని రాష్టాలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్స్‌‌పై కూడా మూడు నెలలు మారటోరియం విధించాలని కోరింది. 

 

అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్‌కు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జనరేషన్ అండ్ ట్రాన్స్‌మిషన్ కంపెనీలు మూడు నెలలు మారటోరియం ఊరట కలిగించాలని సూచించింది. భవిష్యత్ పవర్ కొనుగోలుకు సంబంధించి పేమెంట్ సెక్యూరిటీ మొత్తాన్ని సగానికి తగ్గించాలని, లేట్ పేమెంట్స్‌పై నో చార్జీలు వంటి ప్రయోజనాన్ని కలిగించాలని పేర్కొంది. అలాగే కరెంట్ కట్ లేకుండా నిరంతరం ప్రజలకు విద్యుత్ అందేలా చూడాలని కోరింది. దీంతో మూడు నెల‌లు క‌రెంట్ క‌ట్ట‌క‌పోయినా.. పెనాల్టీలు పడవు.. కనెక్షన్ కట్ అవ్వ‌దు. కాబ‌ట్టి నిశ్చింతగా ఉండండి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: