ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు బాగా ఇబ్బంది పడుతున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. చైనా అమెరికా, ఇటలీ తర్వాత ఆ దేశమే ఎక్కువగా అవస్థలు పడుతుంది. అక్కడ మరణాలు కూడా భారీగా ఉన్నాయి. వ్రుద్దులను ఇప్పుడు ఆ దేశం కాపాడుకోలేక నానా అవస్థలు పడుతుంది. అక్కడ మందులు కూడా ఇప్పుడు కొరత ఉందని వైద్య సదుపాయాలు అసలు లేవని అంటున్నారు. ఇప్పటికే అక్కడ ఆస్పత్రులు అన్నీ కూడా రోగులతో నిండిపోయి ఉన్నాయని కొందరు అంటున్నారు. అక్కడ పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. 

 

ఇప్పుడు స్పెయిన్ లో మరణాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి మాట. దీనితో అక్కడ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకని ప్రాంతాలను పూర్తిగా విభజించి మరో దేశం లా చేసి అక్కడి ప్రజలను కరోనా ప్రభావిత ప్రాంతాల్లోకి రాకుండా చేసే వ్యూహం అమలు చెయ్యాలని భావిస్తుంది. అంటే ఏమీ లేదు. అక్కడ రోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. అయినా సరే అక్కడ వైరస్ బాధితులు తగ్గడం లేదు. దీనితో ఇప్పుడు కరోనా అసలు ఒక్క కేసు కూడా లేని ప్రాంతాలను పూర్తిగా వేరు చేసే ఆలోచన చేస్తుంది. ఇటు నుంచి అటు ఒక్కరు కూడా వెళ్ళకూడదు అని. 

 

నిత్యావసర సరుకులు అయినా మరొకటి అయినా సరే అక్కడి వాళ్ళు అక్కడే వాడుకోవాలి గాని ఇతర ప్రాంతాల నుంచి రాకూడదు అనేది ఆ దేశ వ్యూహంగా ఇప్పుడు కనపడుతుంది. కరోన వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే ఇది ఒక్కటే మార్గం అని ఆ దేశం భావిస్తుంది. ఇంకొకటి ఏంటీ అంటే ఇప్పుడు కరోనా వైరస్ నుంచి బయటపడిన వారిని పూర్తిగా మరో ప్రాంతానికి తరలించే ఆలోచన చేస్తుంది అక్కడి ప్రభుత్వం. వీటిని వెంటనే అమలు చెయ్యాలని చూస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: