మన దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. అక్కడ క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య సిబ్బంది కూడా ఇప్పుడు అక్కడికి రావడానికి భయపడే పరిస్థితి దాదాపుగా నెలకొంది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఎన్ని విధాలుగా చెప్పినా సరే రోడ్ల మీదకు వస్తున్నారు. దీనితో కరోనా కట్టడి చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతుంది మహారాష్ట్ర. అక్కడి ప్రజలు అదుపు కావాలి అంటే కేంద్ర బలగాల అవసరం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే కేంద్ర పెద్దలకు ఇప్పటికే పూర్తిగా సమాచారం ఇచ్చింది అంటున్నారు. 

 

కరోనా కట్టడి కావడానికి ఇప్పుడు కేంద్రం పూర్తి స్థాయిలో ఆ రాష్ట్రానికి సహకరించాల్సిన అవసరం ఉంది. దేనితో ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్యూబా నుంచి అక్కడికి వైద్యులను రప్పించే యోచన చేస్తుంది కేంద్రం. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అవి అదుపు కావడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది మాత్రం సాధ్యం కావడం లేదు. మరణాలు కూడా క్రమంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రత మరింత పెరిగే సూచనలు ఆ రాష్ట్రంలో కనపడుతున్నాయి. ఇప్పుడు అక్కడి ప్రజలు కూడా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని కూడా పాటించడం లేదు. 

 

ఇప్పుడు క్యూబా నుంచి వైద్య బృందాన్ని ప్రత్యేక విమానంలో తీసుకుని వచ్చే ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు అందరూ కూడా ముంబై, పూణే లలో పని చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ క్యూబా ప్రభుత్వంతో కూడా మాట్లాడినట్టే వార్తలు వస్తున్నాయి. ఇక క్యూబా దగ్గర మందు కూడా ఉంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనితో క్యూబా సహకారం తీసుకుంటే మంచిది అని భావిస్తుంది మోడీ సర్కార్. త్వరలోనే వాళ్ళు రానున్నారు..

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: