వైసీపీలో ఇటీవ‌ల మంత్రుల మ‌ధ్య అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ జ‌రిగింది. ప్ర‌స్తుతం క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య శాఖ మంత్రిగా ఏలూరు ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత ఆళ్ల‌కాళీ కృష్ణ శ్రీనివాస్ ఉర‌ఫ్ ఆళ్ల‌నాని కీల‌క రోల్ పోషిస్తున్నా రు. క‌రోనా వైర‌స్ చైనాలో మొద‌లై.. దేశానికి వ్యాపించింద‌ని తెలియ‌గానే ఆయ‌న అలెర్ట్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌న ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లారు.

 

అంతేకాదు, రాష్ట్రంలోని తిరుప‌తి, గుంటూరు, కాకినాడ‌ల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయ‌డంతోపాటు, క్వారంటైన్ కేంద్రాల‌ను కూడా ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆయ‌న అక్క‌డితో ఆగిపోలేదు. విదేశాల నుంచి వ‌స్తున్న వారిపై గ‌త ఏడాది డిసెంబ‌రు నుంచే నిఘా పెంచారు. వ‌చ్చివారిని విమానాశ్ర‌యంలోనే ప‌రీక్షించ‌డం మొద‌లుకుని, వారికి అవ‌స‌ర‌మైన క్వారంటైన్ ఏర్పాటు చేయ‌డంలోనూ కీల‌క రోల్ పోషిచారు. నిజానికి ఆళ్ల కృషి కార‌ణంగానే రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య నియంత్ర‌ణ‌లో ఉంద‌ని చెప్ప‌చ్చు.

 

ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌స్తావించారు. ఆళ్ల అన్న ప్ర‌తి జిల్లాలోనూ తిరుగుతూ ప‌రిస్థితిని స‌మీక్షించి ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అందుకే మ‌న రాష్ట్రంలో వ్యాప్తి త‌గ్గింద‌న్నారు. దీంతో తోటి మంత్రుల్లోనూ అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి హ‌డావుడీ చేయ‌ని ఆళ్ల‌పై ప్ర‌త్యేక భావ‌న ఏర్ప‌డింది. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ క‌రోనా ప‌ర్య‌వేక్ష‌ణ‌కు, అధికారుల‌తో చ‌ర్చించేందుకు స‌మీక్షించేందుకు ఆళ్ల నేతృత్వంలో ఓ క‌మిటీని వేశారు. ఈ క్ర‌మంలో రెండు రోజుల కింద‌ట మీడియాతో స‌ద‌రు చ‌ర్చ‌ల తాలూకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ముందుగా ఆళ్ల మాట్లాడిన త‌ర్వాత మ‌రో మంత్రి పేర్ని నాని మాట్లాడ‌తార‌ని మీడియాకు చెప్పారు.

 

అయితే, ఈ సంద‌ర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. అంతా ఆళ్ల నాని చెప్పేశారు. సీఎం జ‌గ‌న్ త‌ర్వాత ఆయ‌నే! అని ముక్త‌స‌రిగా కితాబిచ్చి.. మీడియా స‌మావేశాన్ని ముగించారు. మొత్తానికి మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టి ప‌ది మాసాలైనా ఏనాడూ మీడియా ముందుకు అతిగా రాని ఆళ్ల‌.. ఇప్పుడు కీల‌క స‌మ‌యంలో జ‌గ‌న్ త‌ర్వాత నువ్వే అన్నా అని అనిపించుకోవ‌డం వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింద‌ని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: