కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకి వెళ్ళకపోతే మాత్రం పరిస్థితులు మరింతగా దిగజారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లాక్ డౌన్ ని ప్రకటించినా సరే ప్రజలు మాత్రం రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఎవరికి ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎక్కడా కూడా ప్రభుత్వాల మాట వినే పరిస్థితి దాదాపుగా దేశంలో కనపడటం లేదు. దీనితో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. 

 

ఎవరు అయితే రోడ్ల మీదకు వస్తారో వారు అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తుంది. ఏమీ లేదు. రోడ్డు మీదకు వెళ్ళిన వాళ్ళ మీద ఇక నుంచి హత్య కేసుతో పాటుగా నాన్ బెయిల్ కేసులు కూడా పెట్టాలని భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు కేంద్రం పలు సూచనలు కూడా చేసినట్టు సమాచారం. హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఈ నిర్ణయాలు మరింత కఠినం గా అమలు చెయ్యాలని కేంద్రం సూచించింది. ఎక్కడ అయితే ప్రజలు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారో... 

 

వాళ్ళ మీద ఈ కేసులు పెట్టాలని కేంద్రం భావిస్తుంది. ప్రతీ ప్రాంతంలో కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. ఇక గ్రామాలను కూడా పూర్తిగా మూసి వెయ్యాలని కేంద్రం భావిస్తుంది. ప్రతీ ప్రాంతంలో కూడా ప్రజలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వారి మీద అవసరం అయితే లాఠీ చార్జ్ కాదు ఇంకా కఠిన చర్యలు అమలు చెయ్యాలని ఇప్పుడు గనుక చిన్న తేడా వచ్చినా సరే దేశం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్రం ఈ అడుగులు వేస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: