ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.   ప్రపంచాన్ని భయ బ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ ప్రతిరోజూ దాని ప్రభావాన్ని చూపిస్తుంది.  వేలల్లో మరణాలు.. లక్షల్లో బాధితుల సంఖ్య పెరిగిపోతుంది.  తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై బీహార్ మంత్రి సంజయ్ ఝా మండిపడ్డారు. వీరిద్దరి వల్ల బీహార్ లో లాక్ డౌన్ ఫెయిల్ అయిందని ఆరోపించారు.  ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల వల్ల వేలాది వలస కార్మికులు రాష్ట్రంలోకి వచ్చారని అన్నారు.   

 

తమ రాష్ట్ర సరిహద్దుల్లో సిరియస్ యాక్షన్ లో ఉన్నామని.. వలస కార్మికులను తమ సరిహద్దు లోపలే స్పెషల్ క్యాంపులో ఉంచాలని  నిర్ణయించామని అన్నారు. దాంతో  తమ ప్రభుత్వంపై  ప్రజలు విమర్శలు గుప్పించడం ప్రారంభించారని... ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలకు లేని ఇబ్బంది మీకెందుకని నిలదీశారని సంజయ్ ఝా తెలిపారు. లాక్ డౌన్ కు ప్రధాని పిలుపునిచ్చిన తర్వాత కూడా బస్సులను ఏర్పాటు చేసి వీరిని ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. 

 

పశ్చిమబెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుంచి కూడా కార్మికులు వచ్చారని... వీరి కోసం బస్సులను ఏర్పాటు చేసిన వారంతా ప్రధాని పిలుపును సీరియస్ గా పట్టించుకోనట్టేనని అన్నారు.  ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి, యూపీలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను  ఏర్పాటు చేశారని... వేలాది మందిని తరలించారని చెప్పారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: