క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లా కుత‌లం చేస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌పంచాదేశాల ప్ర‌జ‌ల‌ను క‌మ్మేసింది. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు అబ్బా అంటున్నారు. ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడుతుంది. అమెరికాతో పాటు ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో సైతం క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ కోవిడ్ 19 మిగతా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే 185 దేశాలకు ఈ వైరస్ పాకగా.. ముఖ్యంగా 15 దేశాల్లో మాత్రం దీని తీవ్రత తారాస్థాయిలో ఉంది. 

 

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7,23,345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అగ్రరాజ్యం అమెరికాలోనే 1,42,735 నమోదు కావడంతో.. అక్కడి పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.  కరోనా వైరస్ ను రాజకీయంగా మొదట్లో కొట్టేసి లైట్ గా తీసుకోవడంతో ఇప్పుడు అమెరికాకు మించిన భారమై కూర్చున్నది.  మూడో స్టేజ్ వరకు పెద్దగా పట్టించుకొకపోవడం, పదేపదే చైనాపై నిందలు వేస్తూ సమయం వృధా చేయడంతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 

ఇక ఇప్ప‌టికే అమెరికాలో కరోనా మరణాలు రెండు వేలు దాటాయి. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూ యార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే వణుకుతున్నారు. కాగా, అమెరికాలో మొట్టమొదటి కరోనా కేసు జనవరి చివరి వారంలో నమోదైంది. అప్పుడే మేల్కొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: