ప్రపంచదేశాలను వణికిస్తున్న కొరోనా వైరస్ ప్రభావం అగ్రరాజ్యం అమెరికా మీద చాలా తీవ్రంగానే ఉంది. రాబోయే రెండు వారాలే అమెరికా భవిష్యత్తును మార్చేస్తుందా ? స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ స్వయంగా చేసిన ప్రకటన, పెట్టిన ట్వీటే ఇందుకు నిదర్శనంగా మారింది. స్వయంగా ప్రధామ పౌరుడే రాబోయే రెండు వారాల్లో తక్కువలో తక్కువ లక్షమంది దాకా కొరోనా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడంటే పరిస్ధితి ఎంత భయకరంగా ఉందో అర్ధమైపోతోంది.

 

ప్రస్తుతం అమెరికా మొత్తం మీద 1.42 లక్షల మంది వైరస్ భారిన పడగా సుమారు 2500 మంది చనిపోయారు. సోమవారం  ఒక్క రోజే 17 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తం మీద న్యూయార్క్, న్యూ జెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాలు చాలా తీవ్రంగా దెబ్బ తిన్నట్లే అనిపిస్తోంది. ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఫాసీ అంచనా ప్రకారం కొరోనా మహమ్మారి దెబ్బకు లక్షమంది దాకా మరణించే అవకాశాలున్నాయి. ఫాసీనే లక్షన్నాడంటే వాస్తవ లెక్కలు ఇంకెంత భయంకరంగా ఉంటుందో.  

 

అలాగే బ్రూక్ డేల్ యూనివర్సిటి హాస్పిటల్ లోని ఫిజీషియన్ డాక్టర్ అరబియా అంచనా ప్రకారం అమెరికాలో సుమారు 10 లక్షల మందికి కొరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందట. మొత్తం మీద ప్రపంచదేశాల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూసే అమెరికాయే ఇపుడు వైరస్ నుండి తప్పించుకోవటానికి నానా అవస్తలు పడుతోంది. విచిత్రమేమిటంటే శతృవు కనిపించకపోవటం ఒక సమస్య అయితే శతృవును నియంత్రించటానికి మందులు కూడా లేకపోవటం. దాంతో వైరస్ యధేచ్చగా  విజృంభిస్తోంది.

 

వైరస్ కు మందులు కూడా లేకపోవటంతో రోగుల విషయంలో అమెరికా చేతులెత్తేసింది. ఒకవిధంగా అమెరికా తల్లకిందులైపోతుందనే చెప్పాలి. రోగులను చేర్చుకోవటానికి సరిపడా ఆసుపత్రులు లేవు. ప్రాణాల మీదకు వచ్చినపుడు పెట్టడానికి వెంటిలేటర్లు లేవు, వైద్య సిబ్బందికి మాస్కులు కూడా కొరతగానే ఉంది. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఎలాగూ లేవు. ఇటువంటి పరిస్ధితుల్లో వైరస్ ధాటిని ఎదుర్కొనే అవకాశం లేక చివరకు అధ్యక్షుడే వైరస్ కు తలవంచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: