కరోనా...కరోనా...కరోనా.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న పేరు కరోనా. అగ్ర దేశాలు సైతం ఈ కోవిడ్ వల్ల విలవిల్లాడిపోతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు మన దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారివే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో నివసించే ఒక పానీపూరి వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వార్తతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాములుగా బయటకు వెళ్లి తిరిగొచ్చే వ్యక్తికి కరోనా వస్తే, ఆ చుట్టు పక్కల ఉండే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాంటిది ఒక పానీపూరి వ్యాపారికి ఈ వైరస్ సోకిందంటే, ఎంత మందికి పరీక్ష చేయాలో?

 

 

వివరాల్లోకి వెళ్తే, విజయవాడలోని కృష్ణలంకలో ఉండే ఒక పానీపూరి వ్యాపారి కొన్ని రోజుల క్రితం మక్కా వెళ్ళాడు. తిరిగొచ్చిన తర్వాత, ఎప్పటిలాగే అతని వ్యాపారాన్ని కొనసాగించాడు. కొన్ని రోజుల తర్వాత, దేశం మొత్తం లాక్ డౌన్ చేయడంతో ఇంట్లో ఉండిపోయాడు. అయితే అతనికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో, హాస్పిటల్ లో చేరాడు. డాక్టర్లు అతనికి రకరకాల పరీక్షలు చేసి, కరోనా పాజిటివ్ అని తేల్చారు. కానీ ఇక్కడొచ్చిన అసలు  సమస్య ఏంటంటే, ఆ వ్యక్తి పానీపూరి వ్యాపారి కాబట్టి చాలా మంది ఇతని దగ్గరకు వచ్చి ఉంటారు. వాళ్లందరినీ వెతికి పట్టుకుని పరీక్షలు చేయడం చాలా కష్టం. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటో కూడా తెలియడం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఆ వ్యక్తి కుటుంబానికి, చుట్టు పక్కల ఉండే వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయో అని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. దీంతో విజయవాడలో లాక్ డౌన్ షరతులను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.        

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: