ప్రపంచం మొత్తాన్ని కొరోనా వైరస్ ఎంతలా వణికిస్తోందో అందరికీ తెలిసిందే.  ఏ దేశంలో చూసినా  వైరస్ విస్తరణ చాలా వేగంగా ఉంటోంది. వైరస్ ఇంత వేగంగా అసలు ఎందుకు విస్తరిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే విస్తరణకు మూల కారణాన్ని వైద్యులు తాజాగా కనుక్కొన్నారు. యువకుల వల్లే వైరస్ చాలా స్పీడుగా విస్తరిస్తోందంటూ వైద్యులు, పరిశోధకులు నిర్ధారించారు. యువకుల వల్లే ఎందుకింతగా విస్తరింస్తోందన్నదే అసలైన ప్రశ్న.

 

ఎందుకంటే యువకుల్లో ఇమ్యునిటి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ మార్గంలో వైరస్ సోకినా యువకుల్లో తొందరగా బయటపడదన్న విషయం అందరికీ తెలిసిందే. తమకు వైరస్ సోకిందన్న విషయం తెలీకుండానే యువకులు ఎక్కెడెక్కడో తిరిగేస్తారు. ఎంతోమందిని కలుస్తుంటారు. పాశ్చాత్య సంస్కృతి మనకు కూడా ఎక్కువైపోయిన కారణంగా నలుగురు కలిసినపుడు ఒకళ్ళని ఒకళ్ళు హత్తుకోవటాలు ఎక్కువైపోయాయి. షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవటం, హత్తుకోవటం ఇంకాస్త ముందుకెళ్ళి ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారు.

 

ఇటువంటి యువకుల్లో ఓ ఇద్దరికి వైరస్ ఉన్నా అది వందలమందికి వ్యపించే ప్రమాదం ఉంది. తాజాగా లండన్ నుండి వచ్చిన కొడుకును డిఎస్పీ క్వారంటైన్ లో చేర్చకుండా దాచిపెట్టాడు. దాంతో ఆ యువకుడు నాలుగు రోజుల పాటు తనిష్టం వచ్చినట్లు తిరిగేశాడు. ఎన్నో పార్టీలకు అటెండ్ అయ్యాడు. ఓ వారం రోజుల తర్వాత చాలామంది జలుబు, దగ్గు మొదలైంది. విషయం ఆరాతీస్తే వారంతా యువకుడితో సన్నిహితంగా ఉన్నట్లు బయటపడింది. ఇపుడు ఆ డిఎస్పీ కొడుకు వారం రోజుల్లో ఎవరెవరిని కలిశాడనే విషయాన్ని ఆరాతీయలేక నానా అవస్తలు పడుతున్నారు.

 

అదే యువకులకు కాకుండా ముసలి వాళ్ళకో లేకపోతే పిల్లలకో సోకితే వెంటనే బయటపడిపోతుంది. కాబట్టి వైరస్ అసలు క్యారియర్స్ యువకులే అన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందుకనే ప్రభుత్వాలు విదేశాల నుండి వచ్చిన వాళ్ళల్లో ప్రధానంగా యువకులపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. బాధాకరం ఏమిటంటే విదేశాల నుండి వచ్చిన వారిలో సుమారు 450 మంది ఏపిలో అడ్రస్ దొరక్కుండా తిరుగుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: