కరోనా వైరస్ ప్రభావం భారతీయులపై తీవ్ర స్థాయిలో ఉంది. తాజాగా కరోనా వైరస్ భయంతో ప్రజలు చేస్తున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ వార్తలకెక్కుతున్నాయి. హర్యానా రాష్ట్రంలోని రెవారి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 30 శాతం కాలిన గాయాలతో స్థానిక ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అరే, ఏంటయ్యా ఈ కాలిన గాయాలు, అస్సలు ఏమైంది? అని అక్కడి వైద్యులు ప్రశ్నించగా... తాను మాట్లాడుతూ... ' చేతులు కడుక్కునేటప్పుడు హ్యాండ్ శానిటైజెర్ నా చొక్కా పై పడింది. అయితే నేను వంటగ్యాస్ వద్దకు వెళ్లినప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందుకే గాయాలయ్యాయి, సార్' అని చెప్పుకొచ్చాడు.



గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో హ్యాండ్ శానిటైజెర్లు వాడటం వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయని ప్రచారం జరిగింది. అయితే ఈ సంఘటనతో అది నిజమని తెలిసింది. వైద్యాధికారులు కూడా హ్యాండ్ శానిటైజెర్లలలో 62 శాతం ఈథైల్ ఆల్కహాల్ ఉంటుందని... అది వెంటనే మంటని పుట్టిస్తుందని... అందుకే చాలా తక్కువ మోతాదులో వాడాలని... అలాగే కిచెన్ లోకి వెళ్లే ముందు చేతులు బాగా కడుక్కొని... ఆరిపోయిన తరువాత మాత్రమే వంటగ్యాస్ వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు.




ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 88కి చేరుకోగా... అందులోని 14 మంది వ్యాధి నుండి రికవర్ అయ్యి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. చండీఘర్ లో 5 కొత్త కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరికి కెనడా వెళ్ళిన ట్రావెలింగ్ హిస్టరీ ఉంది. చండీగర్ లో మొత్తం కేసుల సంఖ్య ప్రస్తుతం 13 కి చేరుకుంది. వాయిదాపడిన టోక్యో ఒలంపిక్స్ జులై 23 2021 నుండి ఆగస్టు 8 2021 వరకు జరగనున్నాయి. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ పినరాయి మాట్లాడుతూ... ఈ రోజు మొత్తం 32 కొత్త కేసులు నమోదు కాగా... అందులోని 17 మందికి విదేశీ ట్రావెలింగ్ హిస్టరీ ఉందని తేలిందని... ఈ కొత్త కేసులతో మొత్తం 213 కేసులు నమోదయ్యాయని కేరళ సీఎం తెలిపారు.



తాజాగా మహారాష్ట్ర ముంబైలోని ఒక  ప్రైవేట్ హాస్పిటల్ లో ఓ 80 ఏళ్ల కరోనా వ్యాధిగ్రస్తురాలు చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 219 కేసులు నమోదు కాగా... 32 మంది వ్యాధి నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఆ వృద్ధురాలి మరణంతో మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 10కి చేరుకుంది.



కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా ఐదు కేసులు నమోదు కాగా... కరోనా బాధితుల సంఖ్య 88 కి చేరుకుంది.


ఇకపోతే కరోనా బాధితుల సంఖ్య క్లుప్తంగా తెలుసుకుంటే...


ప్రపంచలో మొత్తం కేసులు: 7, 38, 457
మరణాలు: 35, 005
రికవరీ కేసులు: 1, 56, 308


ఇండియాలో మొత్తం కేసులు: 1, 108
మరణాలు: 31
కొత్త కేసులు: 78
రికవరీ కేసులు: 86


తెలంగాణలో మొత్తం కేసులు: 70
మృతులు: 1
ఏపీలో మొత్తం కేసులు: 23
మృతులు: 0


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: