కొరోనా వైరస్ దెబ్బకు రోగుల సంఖ్య పెరిగిపోవటం సంగతి దేవుడెరుగు. ముందు డాక్టర్లే అల్లాడిపోతున్నారు అమెరికాలో. ఊహించని రీతిలో కొరోనా రూపంలో ఉపద్రవం వచ్చి పడటంతో డాక్టర్లకు ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. అందుబాటులో ఉన్న ఆసుపత్రులు తక్కువ. మెడికల్ ఎక్విప్మెంట్ ఏమాత్రం సరిపోవటం లేదు. పైగా ఈ వైరస్ కు అసలు మందే లేదు. అన్నింటికి మించి రోగుల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోతుండటంతో డాక్టర్లు ఏమి చేయలేక అల్లాడిపోతున్నారు.

 

కొలంబియా యూనివర్సిటి ఆసుపత్రయితే కొరోనా రోగులను చేర్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఎందుకంటే యూనివర్సిటి ఆసుపత్రిలోని మొత్తం 4500 మంది సబ్బందిలో 1200 మంది కొరోనా రోగులే. వీరిలో 25 శాతం మంది ఇన్సెంటివ్ కేర్ లోన ఉన్నారట. ఇంతమంది రోగులు ఆసుపత్రిలోను మరో 25 శాతం మంది ఇన్సెంటివ్ కేర్లోను ఉండటంతో ఇంక బయట నుండి వస్తున్న రోగులను చేర్చుకుంటే ఎక్కడ పెట్టాలి ? వాళ్ళకేమి చికిత్స చేయాలి ? అన్నది యూనివర్సిటి ఉన్నతాధికారుల సమస్య.

 

ఇప్పటికందని సమాచారం ప్రకారం అమెరికాలో బాధుతల సంఖ్య సుమారుగా 1.5 లక్షలైతే దాదాపు 2500 మంది దాకా చనిపోయారు. ఒక అమెరికాలో మాత్రమే బాధితుల సంఖ్య సుమారు 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అక్కడి వైద్యులు అంచనా వేస్తున్నారు. అంచనాలే ఇంత భయంకరంగా ఉంటే ఇక అది వాస్తవమైతే పరిస్ధితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు.

 

న్యూయార్కులో రోగుల సంఖ్య 60 వేలకు దగ్గరలో ఉంది. 13 వేలతో న్యూజెర్సీ, 6 వేల కేసులతో కాలిఫోర్నియా మూడోస్ధానంలో నిలుస్తోంది. దాంతో రోగుల సంఖ్యకు తగ్గట్లుగా ఆసుపత్రులు లేకపోవటంతో డాక్టర్లు అల్లాడిపోతున్నారు. తమ ఆసుపత్రిలోకి ప్రవేశించగానే ఓ వార్ జోన్లో ప్రవేశించిన ఫీలింగ్ కలుగుతోందని బ్రూక్ డేల్ యూనివర్సిటి ఫిజీషియన్ డాక్టర్ అరబియా చెప్పాడంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధమైపోతోంది. మూడు షిఫ్టుల్లో మొత్తం వైద్య సిబ్బంది పనిచేస్తున్నా వస్తున్న రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నట్లు అరబియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: