శ్రామికుల పాలిట కరోనా వైరస్ శత్రువుగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి వలస జీవులను ఎటూ కదలనీయకుండా చేస్తోంది. దేశం వలస కూలీ సమస్యతో అల్లాడుతోంది. లాక్ డౌన్ వల్ల పనులకు వెళ్లలేక, సొంత ఊర్లకు చేరలేక వీరు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వలస కూలీల పాలిట కరోనా వైరస్ శాపమైంది. దేశవ్యాప్తంగా వలస కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో సొంతూళ్లలో తమ వారి బాగోగులు చూసుకునే వారు లేకపోవడం... సొంతూళ్లకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో వీరిలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల వలస కూలీలు పడుతున్న ఇబ్బందుల గురించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టు న్యాయవాది అలోక్ శ్రీ వాస్తవ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. 
 
సొలిసిటర్ జనరల్ ఈ అంశం గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయని తెలిపారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరారు. సుప్రీం కోర్టు స్టేటస్ రిపోర్టుతో పాటు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. కోర్టు రేపు ఈ పిటిషన్ ను విచారించనుంది. 
 
దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో వీరు గుంపులుగుంపులుగా వలస వస్తున్నారు. వీరిలో ఒక్కరికి కరోనా వైరస్ సోకినా అందరికీ వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను అనుమతిస్తున్నా వారు క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నాయి. సుప్రీం వీరి విషయంలో ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: