ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ని అరికట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  ఒక్కొ దేశంలొ ఒక్కో పద్దతిలో కరోనాని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎక్కువ దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  మన దేశంలో ఈ నెల 24 నుంచి  లాక్ డౌన్ ప్రకటించిన  విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదల ఆగకపోవడంతో లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

 

తనవద్ద ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే కరోనా లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు దాదాపు లేవని అన్నారు. క్రియాశీలక కేసుల సంఖ్య 901గా ఉందని, మరణాలు 27 మాత్రమేనని వెల్లడించారు. రెండ్రోజుల్లో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  దేశంలో కరోనా అదుపు లోకి వస్తుందని అనుకుంటున్నాం.  అయితే లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు స్వచ్చందంగా పాటించాలని.. ఇంకా కొంత మంది రోడ్లపై తిరుగుతున్నారు.  ఇలా లాక్ డౌన్ ఉల్లంఘిస్తుంటే కరోనా ని కట్టడి ఎలా చేస్తారని ప్రశ్నించారు. 

 

విదేశాల నుంచి వచ్చిన చాలామందికి 14 రోజుల క్వారంటైన్ వ్యవధి పూర్తయిందని, వారందరనీ త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నవారిలో 10 శాతం మందిని పంపించివేశామని, మరో వారంలో ఈ డిశ్చార్జి శాతం 50కి చేరుతుందని తద్వారా కరోనాపై మనం పైచేయి సాధించినట్టే భావించాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  కరోనాకు భయ పడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఎదిరించి పోరాడాలి అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: