కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో వందల సంఖ్యలో శిక్షని అనుభవిస్తున్న నేరగాళ్లు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఐతే భారతదేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కలవరపెడుతున్న వేళ... సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న నేరగాళ్లను పెరోల్ మీద ఎనిమిది వారాల పాటు విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 11 వేల నేరగాళ్ళు విడుదలయ్యారు. అయితే తాజాగా బీహార్ రాష్ట్రంలోని ముజాఫ్ఫర్పూర్ జిల్లాలో 43 మంది ఎనిమిది వారాల పాటు రిలీజ్ కాబడ్డారు.



ఈ లాక్ డౌన్ సమయంలో అనేక ప్రాంతాలలో మానవత్వం కనిపిస్తుంది. హర్యానా రాష్ట్రంలో కొంతమంది మంచివాళ్ళు అవసరమైనవారికి పంపిణీ చేయడానికి పంచకులాలోని మాతా మాన్సా దేవి ఆలయంలో అయిదు వేల ఆహార పొట్లాలను తయారుచేసారు. వాళ్లందరికీ లీడర్ అయిన సంజయ్ మాట్లాడుతూ మురికివాడల్లో నివసించే పేదవారికి ప్రతిరోజూ ఐదు వేల ఆహార పొట్లాలు అందిస్తున్నామని తెలియజేశారు. మహారాష్ట్రలోని ఖండ్‌వాలాకు చెందిన దేవరాజ్ ముంబైలో ప్రతిరోజు 100 కి పై చిలుకు ఆకలితో అలమటిస్తున్న వీధి కుక్కలకు అన్నం పెడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ నేను 'గత 12 సంవత్సరాలుగా వీధి కుక్కలకు ఆహారం ఇస్తున్నాను, కాని ఈ లాక్ డౌన్ సమయంలో ఇతర వ్యక్తులతో కలిసి అన్ని ప్రాంతాల కుక్కలకు ఆహారం పెట్టాలని నిర్ణయించుకున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం జంతు ప్రేమికులు ఇతన్ని తెగ కొనియాడుతున్నారు.



భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం ఈరోజు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా తమ ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలైన ఎల్పిజి గ్యాస్ పంపిణీ కార్యకలాపాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా కోవిడ్ 19 వ్యాధి లక్షణాలతో చనిపోతే రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా లభించనుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రిటైరయ్యే ఉద్యోగులకు ఒక నెల ఎక్కువగా సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తుంది.


ప్రపంచంలో మొత్తం కేసులు: 739,385
మరణాలు: 35,019
రికవరీ కేసులు: 156,588


ఇండియాలో మొత్తం కేసులు: 1, 120
మరణాలు: 31
కొత్త కేసులు: 80
రికవరీ కేసులు: 100

తెలంగాణలో మొత్తం కేసులు: 70
మృతులు: 1
ఏపీలో మొత్తం కేసులు: 23
మృతులు: 0


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: