కరోనాకు ఎవరు అతితులు కాదు కులమత భేధాలు చూడదు.. అసలు కులం అంటే ఏమిటి.. కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి వేద కాలంలో ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ.. అంతే కానీ ఇదే మనిషి జీవితాన్ని నిరంతరంగా నడిపించదు.. ఇకపోతే పుట్టినప్పట్నుంచి, చనిపోయే వరకు మనుషుల్ని వీడనిది నీడ ఒక్కటే కాదు. కులం, మతం కూడా.. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. పుట్టిన పాపాయిని చూడ్డానికొచ్చే బంధువులు, స్నేహితుల కంటే ముందే కులం, మతం వచ్చేస్తాయి..

 

 

కానీ కొన్ని కొన్ని సార్లు ఈ కులాలు లేకుంటే ఎంత హాయిగా ఉంటుందనిపిస్తుంది.. ఇక లోకానికి ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే అప్పుడు ఈ కులం, మతం గుర్తుకు రాదు.. ఆకలి వేసినవాడికి ఆహారం రుచి తెలియదు అన్నట్లుగా ఆపద మనిషిని కులం అనే పిచ్చి వదిలేలా చేస్తుంది.. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై యుద్ధం కొనసాగుతుండగా, దీనికి సంబంధించిన భయం ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆప్తులకు ఏదైనా అపాయం సంభవించినా వెళ్లడానికి ఆలోచిస్తున్నారు..

 

 

ఇలా భయం నెలకొన్న నేపథ్యంలో ఎవరు చనిపోయినా, ఆ మరణించిన వారు ఒంటరిగానే మిగులుతున్నారు.. వారి అంత్యక్రియలు చేయాలంటే కులం అనే గజ్జి అడ్దం వస్తుంది కదా. కానీ ఇదేమి ఆలోచించకుండా భారతీయ ఐక్యతను చాటే విధంగా ఒక ఘటన జరిగింది.. అదేమంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లో నివసిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడు..ఇతని పేరు రవి శంకర్. ఆయన  క్యాన్సర్ తో బాధపడుతూ కన్ను మూశాడు. అయితే కరోనా నేపధ్యంలో ఇతని అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేని పరిస్థితి  నెలకొంది. ఇలాంటి కష్టకాలంలో విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం సోదరులు రామ్ నామ్ సత్య హై అంటూ రవిశంకర్ కు హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు.

 

 

ఈ సందర్భంగా మృతుని కుమారుడు మాట్లాడుతూ తనకు ఎదురైన ఆపద సమయంలో ముస్లిం సోదరులు ఆదుకుని, అండగా నిలిచారని తెలిపారు.. కాగా ఈ సంఘటన హిందూ, ముస్లింల ఐక్యతకు ఒక ఉదాహరణ అని పలువురు అంటున్నారు. ఇక భారతీయుల అన్యోతను గురించి తెలియని పాకిస్దాన్ తీవ్రవాదులు మతం పేరిట మారణహోమాన్ని సృష్టిస్తున్నారు.. మతం అడ్దుపెట్టుకుని చంపే వారికి ఈ ఘటన గురించి తెలిస్తే అయినా సిగ్గు వస్తుంది కావచ్చూ..  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: