కరోనా మహమ్మారిపై తెలంగాణ రాష్ట్రం తీవ్ర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తూ, కరోనా వ్యాప్తి కట్టడిపై కృషి చేస్తుంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ  కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెబుతున్నారు. ఇక తాజాగా కూడా మీడియా సమావేశం పెట్టి, ఏప్రిల్ 7 తేదీలోపు కరోనా కంట్రోల్ లోకి వస్తుందని ధైర్యం చెప్పారు.

 

ఇక కేసీఆర్‌తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా కష్టపడుతున్నారు. అయితే వీరికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఆర్ధిక మంత్రి హరీష్ రావు కూడా కరోనా పట్ల ప్రజలని అప్రమత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి హరీష్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. ముఖ్యంగా తన సొంత జిల్లా సిద్ధిపేట పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

 

అలాగే అనవసరంగా ఎవరైనా రోడ్ల మీదకు వస్తే వారికి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అసలు అవసరం లేకుండా ఎందుకు వస్తున్నారంటూ, కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతూ, అవసరమైతే వారి బైక్‌లు కూడా సీజ్ చేయించేస్తున్నారు. ఇలా హార్డ్‌గా ఉండటమే కాకుండా కష్టాల్లో ఉన్న ప్రజలని ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

 

ఇక మరి పేద వాళ్ళకు తక్కువ ధరకే కూరగాయలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు, శానిటైజర్లు అందేలా చూస్తున్నారు. వీధుల్లో రసాయనాల స్ప్రే చల్లిస్తున్నారు. ఓ వైపు ఈ విధంగా ఫీల్డ్‌లో ఉండి ప్రజలకు సాయం చేస్తూనే, మరోవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు పెడుతూ, కరోనా వ్యాప్తి అరికట్టేందుకు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికైతే హరీష్ కరోనా వ్యాప్తి పెరగకుండా ఉండేదుకు ప్రజలతో కాస్త హార్డ్‌గా ఉండటానికి కూడా వెనుకాడటం లేదు.  

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: