ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య విషయంలో ఇటలీ దేశం ఉండగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశంలో అమెరికా దేశం ఉంది. ప్రపంచానికి అగ్రరాజ్యం అని పిలిపించుకునే అమెరికా ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల విలవిలలాడుతోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఉన్న కొద్ది వ్యాప్తి చెందుతూ అమెరికన్లను గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ విషయంలో ప్రారంభంలో చాలా కామెడీగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేయటంతో పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయింది. న్యూయార్క్ మరియు న్యూజెర్సీ లాంటి రాష్ట్రాలలో చాలా భయంకరంగా మారింది. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట రాష్ట్రాలలో డోనాల్డ్ ట్రంప్ ఇటీవల లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అమెరికన్లకు ఈ వైరస్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి భారీ ప్యాకేజీని ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. కాగా వైరస్ కి బాగా వాతావరణం సహకరించడంతో ఉన్న కొద్దీ రాబోయే రోజుల్లో వైరస్ ప్రభావం బాగా పెరిగే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రత పాయింట్ మీద అమెరికా అధికారులు గడగడ వణికి పోతున్నారట.

 

అంతేకాకుండా ఉన్న కొద్దీ వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవటంతో లక్షల్లో వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవటంతో అమెరికా మొత్తం బిక్కుబిక్కుమంటూ బతుకుతుంది. అమెరికా ప్రజలంతా తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే అమెరికాలో పక్ష పార్టీలు ఈ కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై బాగా ప్రభావం చూపుతోందని దీనంతటికీ కారణం ట్రంప్‌ అహంకారమే అని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి అమెరికాలో షట్ డౌన్ ప్రకటించకపోతే అమెరికా దేశం కాలగర్భంలో కలిసి పోవడం గ్యారెంటీ అని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: