భార‌త్‌ను దెబ్బ‌కొట్టే ఏ అవ‌కాశాన్ని చైనా వ‌దులుకోదు అన్న విష‌యం ప్ర‌పంచ దేశాలు ఎరిగిన స‌త్యం. ఉగ్ర‌వాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ నిజ‌స్వ‌రూపాన్ని భార‌త్ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై నిరూపించ‌డంతో ప‌రువుపోయి..త‌ల ఎక్క‌డ పెట్టుకోవా లో అర్థం కాని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో పాక్‌పై ఎలాంటి వైఖ‌రి అనుస‌రించాలో తెలియ‌క‌...అంత‌ర్జాతీయ ఒత్తిడితో త‌ప్ప‌నిస రి ప‌రిస్థితుల్లో చైనా కూడా బాహాటంగా విమ‌ర్శ‌లు చేసింది. అయితే ఇదంతా ఉత్తిత్తినే. ఇప్పుడు మ‌ళ్లీ ఈ రెండు దేశాల మ‌ధ్య స్నేహం చిగురిస్తోంది. పాక్‌ను పాముగా మ‌ల్చుకుని భార‌త్‌ను దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తున్న డ్రాగ‌న్ కంట్రీ నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. 

 

అప్ప‌ట్లో బంగ్లాదేశ్‌కు సాయం అంద‌జేసే రూపంలో ఆ దేశానికి ద‌గ్గ‌ర‌వుతుండ‌గా దేశ అధ్య‌క్షురాలు షేక్ హాసీనా అస‌లు విష‌యం క‌నిపెట్టి చైనాను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదు. భార‌త్‌పై అపార‌న‌మ్మ‌కం క‌లిగిన బంగ్లాదేశ్‌ను బుట్ట‌లో వేసుకోవ‌డం అసాధ్యమేన‌ని న‌మ్మి ఏకైక చిర‌కాల ఉగ్ర‌వాద బూచి పాక్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది. అవ‌స‌ర‌మున్న‌ప్పుడ‌ల్లా ఎంతోకొంత ఆర్థిక సాయం అంద‌జేస్తూ కాళ్ల వ‌ద్ద ప‌డిఉండేలా చేస్తోంది. ఇప్పుడు క‌రోనా దేశంలో విజృంభిస్తుండ‌టంతో పాక్ క‌కావిక‌లం అవుతోంది. ఆదేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1600ల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 20మందికి పైగా మ‌ర‌ణించారు. 


పాక్‌లో వేగంగా క‌రోనా పాకేస్తోంది. చాయ్‌..బిస్కెట్‌..క‌రెంటు బిల్లుల‌కు కూడా క‌ట‌క‌ట‌ను ఎదుర్కొంటున్న పాక్‌కు ఇప్పుడు క‌రోనాను అరిక‌ట్ట‌డం అంటే దాదాపు అసాధ్య‌మేన‌ని చెప్పాలి. చుట్టూ ఉన్న అన్నీ దేశాలతోనూ పాక్ స‌త్సంబంధాలు తెగిపోయాయి. చివ‌రికి చిర‌కాల మిత్రదేశ‌మైన చైనానే ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చింది.  వైద్య బృందాలను, మందులను పాక్‌కు పంపిన చైనా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు వుహాన్‌లో 2,300 పడకలతో రెండు ఆసుపత్రులు నిర్మించినట్టుగానే పాకిస్తాన్‌లో కూడా ఆసుపత్రి నిర్మించాల‌ని భావిస్తోందంట‌.  గత వారమే ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునింగ్ కూడా ధ్రువీక‌రించారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: